Breaking News

నగరంలో కుబేరా సిల్వర్‌ షోరూం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో స్వచ్ఛతలో నాణ్యతలో మన్నికైనదనే నమ్మకాన్ని ఇచ్చే కుబేరా సిల్వర్‌ షోరూం ప్రారంభించబడింది. బుధవారం ఎంజిరోడ్డులోని బిఎన్‌ఆర్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూం ప్రక్కన కుబేరా సిల్వర్‌ షోరూంను నిర్వాహకులు ఊరా సాయి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఊరా సాయి మాట్లాడుతూ ఈ రంగంలో ఎంతో అనుభవం కలిగి కుబేరా సిల్వర్‌ షోరూంను నగరంలో ప్రజలకు చేరువుగా ఎంజిరోడ్డులో ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. ఆధునాతన సరికొత్త మోడల్స్‌లో వెండి వస్తువులు, ఆభరణాలను అతి తక్కువ ధరలలో అందిస్తున్నామని చెప్పారు. మగువల మనసు దోచుకునే విధంగా చక్కని నగిషీతో రూపొందించబడిన వెండి వస్తువులు అందుబాటులో తీసుకువచ్చామన్నారు. రాబోయే కాలంలో నాణ్యమైన వెండి వస్తువులు, ఆభరణాలకు మారుపేరుగా కుబేరా సిల్వర్‌ షోరూం నిలవనుందన్నారు. ఈ నూతన షోరూం దినదినాభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచీలు విస్తరించాలని ఆకాంక్షించారు. తమ వద్ద నాణ్యమైన 100 శాతం ప్యూర్‌, ఒరిజనల్‌ వెండితో తయారు చేసిన వస్తువులతోపాటు ఆభరణాలు కూడా అందుబాటులో వున్నాయని ఆధునాతనమైన అతి చిన్న వస్తువులు, పెద్ద ఆర్టికల్స్‌, దేవుని సామాగ్రి, కుందులు, ఉంగరాలు, ప్లేట్లు, గిన్నెలు, చెంబులు, పట్టీలు, గిఫ్ట్‌ ఆర్టికల్స్‌ తదితర వస్తువులు, ఆభరణాలు వివిధ రకాలైన మోడల్స్‌లో మిషన్‌తో, చేతితో కళాత్మకంగా తయారు చేసిన డిజైన్స్‌తో అందుబాటు ధరలో తమ వద్ద లభ్యమవుతాయన్నారు. ఇంత చక్కటి వెండి వస్తువులు, ఆభరణాల షోరూంను ప్రతి ఒక్కరూ సందర్శించి ఖచ్చితమైన నాణ్యమైన వెండి వస్తువులను కొనుగోలు చేసే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని వారు కోరారు. అనంతరం కస్టమర్లు, మిత్రులు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు విచ్చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *