Breaking News

పొరపాటున అల్తాఫ్ రజా పేరు ప్రచురితమైనందుకు చింతిస్తున్నాను…

-ముజావారుల కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అన్సారీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముజావారుల కమిటీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలంటూ ఈ నెల 16వ తేదీన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షుని పేరు సయ్యద్ అల్తాఫ్ అని తాను ప్రస్తావిస్తే వార్తా పత్రికలలో పొరపాటుగా అల్తాఫ్ రజా అని ప్రచురితమైందని ముజావారుల కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అన్సారీ తెలిపారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ మా కమిటీతో సంబంధంలేని అల్తాఫ్ రజా పేరు ప్రచురితమవ్వడం బాధాకరమని అందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉపవాస దినములు జరుగుతున్న నేపద్యంలో సమస్యను రంజాన్ పండుగ తరువాత సభ్యులందరూ సమావేశమై శాంతియుతంగా పరిష్కరించుకుందామని తమ కమిటీ మాజీ అధ్యక్షుడు సయ్యద్ అల్తాఫ్ (న్యాయవాది, వించిపేట, విజయవాడ) చెప్పడం సంతోషదాయకమని అన్సారీ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *