Breaking News

గుడివాడ ఐదో వార్డులో కొనసాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

-వీధి వీధినా మంగళ హారతులు…. పూలమాలలతో బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతున్న ప్రజానీకం
-ఎమ్మెల్యే నానితో ఆత్మీయ సమావేశమైన వెలమ సంక్షేమ సంఘ పెద్దలు…
-సీఎంగా ప్రజలకు చేసిన మంచిని ధైర్యంగా చెబుతున్న జగన్ కు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ పట్టణం ఐదో వార్డులో గురువారం మధ్యాహ్నం నుండి ఎమ్మెల్యే కొడాలి నాని తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. వార్డులోని వడ్లాని సుధాకర్ ఇంటి వద్ద గల ఉప్పలమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే నాని వార్డులో ప్రచారాన్ని మొదలుపెట్టారు. పాదయాత్రగా ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే నానికు వీధి వీధినా మంగళ హారతులతో మహిళా సోదరీమణులు అపూర్వ స్వాగతం పలికారు. పూల మాలలు , శాలువాలతో వార్డులో ప్రజానీకం బ్రహ్మరథం పడుతూ ఎమ్మెల్యే నానిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పర్యటనలో భాగంగా వార్డులోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, శ్రీ కోదండ రామాలయాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతూ సాగుతున్న ఎమ్మెల్యే నాని ప్రచార ర్యాలీలో, పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా శ్రీరాంపురంలోని వెలమ సంక్షేమ సంఘ కమ్యూనిటీ హాల్లో సంఘ పెద్దలతో ఎమ్మెల్యే నాని సమావేశం అయ్యారు.ఎమ్మెల్యే కొడాలి నానికు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా సంఘ పెద్దలు అన్నారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ కులమత వర్గాలకతీతంగా పేదవర్గాల సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తూ, అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన సీఎం జగన్ ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో, ప్రజలందరూ తమ రెండువట్లను ఫ్యాన్ గుర్తుపై నొక్కి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ ను భారీ మెజార్టీలతో గెలిపించాలని ఎమ్మెల్యే నాని విజ్ఞప్తి చేశారు. తీన్మార్ డప్పుల మధ్య జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని సందడి చేశారు.ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, సీనియర్ నాయకులు పాలేటి చంటి, దుక్కిపాటి శశి భూషణ్, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, నాలుగో వార్డ్ వైసిపి నాయకులు వడ్లాని సుధాకర్, వెంపల అప్పారావు, కాండ్రుకొండ మహాలక్ష్మి, అలంకార్ శేఖర్, ఆత్మకూరు మల్లేశ్వరరావు, సోంబాబు, తోట ప్రసాద్, జోగా నాగేశ్వరరావు, కాండ్రుకొండ గంగాధర్ రావు, శ్రీపతి సురేష్, ఏలూరి వీరయ్య, మూడేడ్ల రామారావు, వెలమ సంక్షేమ సంఘ అధ్యక్షుడు గంట ఆనంద్, సంఘ నాయకులు గులిపల్లి ప్రభాకరరావు, సబ్బాని రంగారావు, ముడేడ్ల రామారావు, వంగపండు బ్రహ్మాజీ, సింగి రెడ్డి గగారిన్, సంభంగి రంగారావు,గుడివాడ నియోజకవర్గ వైసిపి నాయకులు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల భాస్కరరావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రేమల్లి నీలాకాంత్, పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడు డోక్కు రాంబాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేండా చంద్రాపాల్, పార్టీనాయకులు రావులకొల్లు మల్లేశ్వరరావు, రావులకొల్లు సుబ్రహ్మణ్యం, రావులకొల్లు హైమావతి, వెంపల అప్పారావు, వెంపటి సైమన్, షేక్ సయ్యద్,జోగా సూర్యప్రకాష్ రావు, నైననవరపు శేషుబాబు, చుండూరి శేఖర్, కోంకితల ఆంజనేయ ప్రసాద్, అగస్త్యరాజు కృష్ణమోహన్, రమణ కుమార్, కృష్ణ కిషోర్ , వీరిశెట్టి నరసింహారావు, తోట శివాజీ,జోగా సూర్యప్రకాష్ రావు, జ్యోతుల శ్రీను,జ్యోతుల సత్యవేణి,చుక్కా నాగలక్ష్మి,దారం నరసింహారావు, మోండ్రు వెంకటేశ్వరరావు, లోయ వరాలు, మాదాసు వెంకటలక్ష్మి,లోయ రాజేష్, మందాడి శ్రీను, నల్లమోతు జగదీష్, స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు మహేష్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు మహేష్, కలపాల కిరణ్,గానుగుల ఆనందమురళి, అడపా పండు, చందరాల హరి రాంబాబు, తోట రాజేష్, గుదే రవి, పూడి సుధాకర్,ఆర్కె, తోట సాయి, జ్యోతుల మణికంఠ,జూనియర్ జమదగ్ని,బొండాల శ్రీను, అసిలేటి అర్జునరావు, గంటా శ్రీను, ఘంటా సురేష్,అవుల నరేంద్ర, అల్లం రామ్మోహన్రావు, అడబాల అప్పారావు,దుడ్డు చిన్నా,గొల్ల సోమేశ్వరరావు, జహృద్దిన్, ఖాదర్ బేగ్, సత్తిరెడ్డి, గంటా చంద్రశేఖర్,రజాక్ భాష,పెద్ది రమణ,పిడుగు శ్రీను, చౌటపల్లి కళ్యాణ్, వినోద్, మామిళ్ల ఎలీషా,పుల్లేటికుర్తి కృష్ణ,తాళ్లూరి ప్రశాంత్,కొండపల్లి కుమార్ రెడ్డి, తోటా నాగరాజు, కందుల నాగరాజు, కొండపల్లి చంద్రశేఖర్ రెడ్డి, పిల్లి బెనర్జీ, సర్దార్ బెగ్, రవి స్వీట్స్ మోహన్, ఎండి యాకూబ్,అబ్దుల్ రహిం, ఎండి సాలెహా,కొండపల్లి శ్రీనివాసరెడ్డి, క్రేన్ బాబి,కంచర్ల జగన్,బలుసు జితేంద్ర, దేవరపల్లి కోటి, లోయ కన్నా, పసలాది శేఖర్,మచ్చా పద్మ, ముడెడ్ల శ్రీను,గుడివాడ నియోజకవర్గ పరిధిలో గుడివాడ టౌన్, రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *