-ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల నిర్దేశిత గడువులోపు వారి ప్రణాలికలు తయారీతో నోడల్ అధికారులు విధులు నిర్వర్తించాలి:కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్షీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారులు వారి విధులను ఎన్నికల కమిషన్ సూచించిన నిర్దేశిత గడువు లోపు వారి కార్యా చరణ ప్రణాళికలు తయారుచేసుకొని తదనుగుణంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల విధులు కేటాయించబడిన వివిధ నోడల్ అధికారులతో వారి కార్యాచరణపై, చేపట్టిన ఎన్నికల విధులపై సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల 2024 నేపథ్యంలో ప్రతి నోడల్ అధికారి వారికి సంబంధించిన విధులకు సంబంధించిన అంశాలపై టైం లైన్ మేరకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల నిర్దేశిత గడువులోపు విధులు అప్రమత్తంగా నిర్వర్తించాలని తెలిపారు. సిఈఓ కార్యాలయానికి పంపాల్సిన రోజువారి, వారాంతపు నివేదికల రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. మ్యాన్ పవర్ నోడల్ అధికారి, ట్రైనింగ్ నోడల్ అధికారి ఇంతవరకు ఇచ్చిన వాటిపై నివేదిక, మెటీరియల్, ట్రాన్స్ పోర్ట్, సైబర్ సెక్యూరిటీ, స్వీప్, లా అండ్ ఆర్డర్, ఈవిఎం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎక్ష్పెండిచర్, బ్యాలెట్ పేపర్స్, పోస్టల్ బ్యాలెట్, మీడియా, కమ్యూనికేషన్ ప్లాన్, ఎలెక్టోరల్ రోల్స్, ఓటరు హెల్ప్ లైన్, అబ్జర్వర్స్, మీడియా, సక్షం నోడల్ అధికారి తదితర విభాగాలలో నోడల్ ఆఫీసర్లుగా విధులు కేటాయించబడిన అధికారులందరూ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొంటూ ఎన్నికల విధుల నిర్వహణ బాధ్యతగా అప్రమత్తంగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహణలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల హ్యాండ్ బుక్ మేరకు పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. త్వరలో జిల్లాకు ఎన్నికల పరిశీలకులు రావడం జరుగుతుందని వారు సదరు రోజు వారీ నివేదికలను పరిశీలించడం జరుగుతుందన్నారు. ఎలక్టరల్ రోల్ సరఫరా, బ్యాలెట్ ప్రింటింగ్, వెహికల్స్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, స్ట్రాంగ్ రూం ల సన్నద్ధతగా పూర్తి స్థాయిలో భద్రత ప్రమాణాలు మేరకు ఏర్పాట్లు ఉండాలని, అబ్జర్వర్స్ ప్రోటోకాల్ అధికారి వారి విధులను నిర్వహించాల్సి ఉంటుంది అని అన్నారు. స్వీప్ కార్యక్రమాలు చేపడుతున్నామని, పోలింగ్ కేంద్ర స్థాయి వరకు మరిన్ని ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు రూపకల్పన చేసి చేపట్టాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎప్పటికప్పుడు అమలు, వాటి పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఎన్నికల విధులను అందరూ నోడల్ అధికారులు అప్రమత్తంగా నిర్వర్తించాలని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ ఎన్నికల నోడల్ అధికారులు, ఎలక్షన్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News