Breaking News

రాజ‌ధాని నిర్మాణానికి విఘ్నాలు రాకుండా ర‌క్షించాలి: కేశినేని జాన‌కి ల‌క్ష్మీ

-లేబర్ కాలనీ మైదానంలో డూండీ గణేష్ విగ్రహ ఏర్పాటు
-భూమి పూజ‌లో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స‌తీమ‌ణి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి ఈసారి ఎలాంటి విఘ్నాలు రాకుండా వినాయ‌కుడు ర‌క్షించాల‌ని , రాజ‌ధాని నిర్మాణం పై, ప్ర‌జలంద‌రిపై ఆ మ‌హా గ‌ణ‌ప‌తి ఆశీస్సులు వుండాల‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ కోరుకున్నారు. డూండి గ‌ణేష సేవాస‌మితి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేయ‌నున్న 72 అడుగ‌ల మ‌హా మ‌ట్టి గ‌ణ‌ప‌తి విగ్ర‌హ ఏర్పాటుకు బుధ‌వారం జ‌రిగిన భూమి పూజ కార్య‌క్ర‌మంలో కేశినేని జాన‌కీ ల‌క్ష్మీ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా విద్యాధరపురం లేబర్ కాలనీ మైదానంలో 72 అడుగుల ఎత్తుగల డూండీ గణేష్ విగ్రహ ఏర్పాటు జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌, డూండి గణేష్ సేవా సమితి నిర్వ‌హ‌కుడు డూండీ రాకేష్, ఎన్టీఆర్ జిల్లా తెలుగు మ‌హిళా అధ్య‌క్షురాలు చెన్నుపాటి ఉషారాణి పాల్గొన్నారు. తెలుగు మ‌హిళ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఈ కార్య‌క్ర‌మానికి భారీ హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా కేశినేని జాన‌కి ల‌క్ష్మీ మాట్లాడుతూ 72 అడుగుల గణేష్ విగ్రహం శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొనటం సంతోషం గా వుందన్నారు. వినాయ‌క‌చ‌వితి కి అంద‌రూ మ‌ట్టి విగ్ర‌హాల‌ను పూజించి పర్యావరణ పరిరక్షించాల‌న్నారు. గ‌త ప్ర‌భుత్వంలో వినాయ‌క‌చ‌వితి వేడుక‌లు నిర్వ‌హించుకోవ‌టానికి లేకుండా ఆంక్ష‌లు విధించార‌ని,..ఈ ప్ర‌భుత్వంలో స్వేచ్ఛ‌గా వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.ఎంపి కేశినేని శివ‌నాథ్ పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు ఢిల్లీ వెళ్ల‌టంతో తాను ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ట్లు తెలిపారు.

అనంత‌రం మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు. ఆ త‌ర్వాత రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు, డూండి గణేష్ సేవా సమితి నిర్వ‌హ‌కుడు డూండి రాకేష్ మాట్లాడుతూ 72 అడుగుల గణేష్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఆ పూజా కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *