వాసవ్య చిన్నారులతో స్నేహితుల దినోత్సవం చేసుకున్న ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని కృష్ణా. యన్.టి.ఆర్ జిల్లాలో ఉన్న ఇన్నర్ వీల్ క్లబ్స్ సభ్యులు అందరూ కలసి వాసవ్య పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాన్ని స్థానిక నాస్తిక కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా లక్ష్మి శ్రీనివాస్, డిస్ట్రిక్ చైర్మెన్, పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ స్నేహితుల దినోత్సవం సందర్బంగా ఇన్నర్ వీల్ క్లబ్ విజయవాడ, విజయవాడ ఈస్ట్, విజయవాడ మిడ్ టౌన్, నూజివీడు మ్యాంగో టౌన్, విజయవాడ దివాస్, విజయవాడ సన్ షైన్, గుడివాడ, ఉయ్యూరు ఇలా అన్ని క్లబ్ లు ఇక్కడ కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ వాసవ్య చిల్డ్రన్ హోమ్ కు అనేక సేవాకార్యక్రమాలను అందిస్తుందని ఈ సహకారం కొనసాగిస్తామని ఆమె అన్నారు. గౌరవ అతిధిగా సరిత లునాని, ఐ.పి, కోశాధికారి మాట్లాడుతూ జీవితంలో ఎదురైన సమస్యలను దైర్యంగా ఎదుర్కొని జీవితంలో ఉన్నత సిఖరాలను ఆధిరోహించాలని ఆమె అన్నారు. ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నారు కావున మీ ముందు ఉన్న పని ఏమంటే చదవడమే కావున జీవితంలో మీరు లక్ష్యాలను ఏర్పరచుకొని దానికి అనుగుణంగా కష్టపడాలని ఆమె పిలుపునిచ్చారు. తర్వాత ఉచితంగా శానిటరీ నాప్కిన్లను బాలికలకు అందజేసారు. అనంతరం స్నేహానికి గుర్తుగా వాసవ్య పిల్లలకు ఫ్రెండ్ షిప్ బ్యాడ్లను కట్టడం జరిగింది.

అంతకు ముందు ఉదయం కానూరులో ఉన్న వాసవ్య చిల్డ్రన్ హోమ్ లో చిన్నారులకు రక్తపరీక్షలను చేయడం జరిగింది. ఈ సందర్బంగా పి.డి.సి రశ్మి సమరం మాట్లాడుతూ ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో కవిత కొడాలి, జి.రేష్మ, డాక్టర్ పి.రేవతి, కె.సంధ్య రాణి, ఆర్.మాలతి మూర్తి, పి. కల్యాణి చౌదరి, కరంబీర్ కౌర్, కె. విజయ, యన్.సుధారాణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *