తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిట్ లో ఉద్యోగాల కొరకు గవర్నమెంట్ ఐటిఐ(Govt ITI) పద్మావతి పురం, తిరుపతి నందు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ కష్టమైసేడ్ స్కిల్ ట్రైనింగ్ మరియు ప్లేస్మెంట్ ప్రోగ్రాం ద్వారా డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాల కొరకు 20- 08- 2024 తేదీన అనగా ఈ మంగళవారం నాడు ఉదయం 9 గంటల నుంచి పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా ఏదైనా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో లో ఉత్తీర్ణత అయిన యువతీ యువకులకు తిరుపతిలోని గవర్నమెంట్ ఐటిఐ, పద్మావతిపురం నందు ఇంటర్వ్యూలు నిర్వహించబడును.
కావున 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన నిరుద్యోగ యువతి మరియు యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను అని తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ,ఆర్ లోకనాథం గారు ఒక ప్రకటనలో తెలియజేశారు మరిన్ని వివరాలకు క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు.
రిజిస్ట్రేషన్ లింకు: https://rb.gy/6son88
రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 19-08-2024.
ఇతర వివరములు కొరకు సంప్రదించండి: 8143576866