విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత నివ్వాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. భవానిపురం 43 వ డివిజన్ రోజ్ గార్డెన్ పార్క్ లో ఏర్పాటు చేసిన స్కేటింగ్ రింక్ ను సోమవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ రోజ్ గార్డెన్ పార్కులో తన చేతుల మీదుగా స్కేటింగ్ రింక్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో సుమారు 73 లక్షల వ్యయంతో 150 మీటర్ల స్కేటింగ్ రింక్ ను క్రీడాకారుల సౌకర్యార్థం నిర్మాణం జరిగిందన్నారు.శిక్షణ పొందిన కోచ్ ల పర్యవేక్షణలో బాల బాలికలకు స్కేటింగ్ లో శిక్షణ ఇస్తారని స్థానిక క్రీడాకారులు స్కేటింగ్ రింక్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో క్రీడా వ్యవస్థను బలోపేతం చేసి క్రీడాకారులను తయారు చేస్తామన్నారు. పెద మధ్యతరగతి క్రీడాకారుల సాధనకు ప్రభుత్వ స్థలాలను పరిశీలించి ఇండోర్ స్టేడియాల నిర్మాణాలను చేపట్టి క్రీడా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. అనంతరం 2023 చైనాలో నిర్వహించిన ఏషియన్ గేమ్స్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన కైవల్య, చైత్ర దీపిక, లను అభినందించారు.
అనంతరం హెచ్ బి కాలనీ అబ్దుల్ కలాం పార్క్ లో ఏర్పాటుచేసిన క్రికెట్ నెట్ ప్రాక్టీస్ పిచ్ ను ఎమ్మెల్యే సుజనా ప్రారంభించారు. క్రీడాకారులు సమయాన్ని వృధా చేయకుండా చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా జాతీయస్థాయిలో పతకాలను సాధిస్తారన్నారు.
కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ దాసరి శ్రీనివాస్ రెడ్డి, ఆర్టిస్టిక్ కోచ్ సత్యం, షేక్ ఖాదర్ బాషా, బబ్లు, నాయకులు అడ్డూరి శ్రీరామ్, పైలా సోమినాయుడు, యేదుపాటిరామయ్య, ముదిరాజ్ శివాజీ, తిరుపతి సురేష్, విశ్వేశ్వరరావు, కొనికి కొండయ్య, కోటేశ్వరరావు, ఎన్డీయే కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *