Breaking News

ప్రకాశం బ్యారేజ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ప్రాంతాన్ని సోమవారం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ కి చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద ఉధృతి కొనసాగుతుందన్నారు. ప్రవాహానికి కొట్టుకు వచ్చిన బొట్ల వలన గేటు కొట్టకు పోయిందని దీనివల్ల ప్రకాశం బ్యారేజ్ కి ఏమి ఇబ్బంది లేదు అన్నారు. వరద తగ్గిన వెంటనే వేగంగా మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్డు లో భారీ వర్షాలకి కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తో కలిసి పరిశీలించారు. కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *