Breaking News

వరద బాధితుల సహాయార్ధం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితుల సహాయార్ధం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఐఏఎస్  అన్నారు. బుధవారం నరేడ్కో గుంటూరు జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తో కలిసి జిల్లా కలెక్టర్ కి రూ.10 లక్షల విరాళం చెక్ ను, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చెలికాని సీతారామయ్య రూ.10 వేలు విరాళం అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ ప్రస్తుతం వరదల వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిల్వడానికి ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నామన్నారు. రూ.10 లక్షలు విరాళం అందించిన నరేడ్కో ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. వారి స్పూర్తితో జిల్లాలోని వివిధ సంస్థలు, దాతలు వరద బాదితులకు అండగా నిలిచేందుకు ముందుకు రావాలని కోరారు. దాతలు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గుంటూరు డిస్ట్రిక్ట్ పేరుతో IDFC బ్యాంక్ అకౌంట్ నం.33260919895, ఐఎఫ్ఎస్సీ కోడ్ IDFC0081061 పేరుతో చెక్ లు, డిడిలు నేరుగా పంపవచ్చని, దాతల వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.
కమిషనర్  మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థలో వరద బాధితులకు విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా డొనేషన్ సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిఎంసి తరుపున ఇప్పటి వరకు 2.26 లక్షలు వాటర్ బాటిల్స్, 2.20 లక్షల పాల ప్యాకేట్స్, 2 లక్షల మందికి అల్పాహారం మరియు భోజనం, 2.50 లక్షల మందికి రాత్రి భోజనం, 2.10 లక్షల బిస్కెట్ ప్యాకెట్స్, 2 వేల బ్రెడ్ ప్యాకేట్స్ అందించామన్నారు. కార్యక్రమంలో నరేడ్కో ప్రతినిధులు పి.నాగ వంశీ, పి.శ్రీనాద్, ఎస్.మధుసూదనరెడ్డి, ఎన్.శ్రీనివాసరావు, కెసిహెచ్. తిరుపతయ్య, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చెలికాని సీతారామయ్య పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *