Breaking News

వరద బాధితులకు ఫ్రీ ఎల్‌ఇడీ సర్వీస్‌ క్యాంప్‌…

-బిగ్‌టీవీ సొల్యూషన్స్‌ ప్లడ్‌ రిలీప్‌ 2024 ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి… : బోండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బుడమేరు వరద ముంపు బాధితులు బిగ్‌టీవీ సొల్యూషన్స్‌ ప్లడ్‌ రిలీప్‌ 2024 ఉచిత ఎల్‌ఇడీ టీవీ సర్వీస్‌ క్యాంప్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. స్ధానిక చుట్టుగుంట బీఎస్‌ఎన్‌ఎల్, అల్లూరి సీతారామరాజు రోడ్డులోని బిగ్‌టీవీ సొల్యూషన్స్‌ కార్యాలయంలో సోమవారం ప్లడ్‌ రిలీప్‌ 2024 ఉచిత ఎల్‌ఇడీ టీవీ సర్వీస్‌ క్యాంప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతి«ధిగా పాల్గొని ఉచిత సర్వీస్‌ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలతో సుమారు 25వేల టీవీలు పాడయ్యయన్నారు. వరదతో పాడయ్యిన టీవీలకు మరమ్మత్తులు చేసేందుకు బిగ్‌టీవీ సొల్యూషన్స్‌ ప్లడ్‌ రిలీప్‌ 2024 ఉచిత ఎల్‌ఇడీ సర్వీస్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేయటం అభినందనీయం అన్నారు. అత్యా«ధునిక పరిజ్ఞానంతో మొరుగైన సేవలు అందిస్తున్న బిగ్‌టీవీ సొల్యూషన్స్‌ను అభినందించారు. బిగ్‌టీవీ సొల్యూషన్స్‌ నిర్వాహకులు కొల్లి సీతారామ్‌ మాట్లాడుతూ తాము రాష్ట్రంలోనే ప్రధమంగా అత్యాధునిక పరిజ్ఞానంతో అన్ని రకాల టీవీలకు అవసరమైన మరమ్మత్తులు అతి తక్కువ ధరలకు నిర్వహిస్తున్నామన్నారు. ఉచిత సేవలు ఈనెల 25వ తేదీ వరకు 20 మంది సిబ్బందితో అందిస్తున్నట్లు తెలిపారు. రోడ్‌ సేప్టీ ఎన్‌జీవో రీజనల్‌ ప్రెసిడెంట్‌ బేతు రామ్మోహనరావు మాట్లాడుతూ వరదలతో పాడయ్యిన టీవీలకు ఉచితంగా సర్వీసింగ్‌ చేయటంతో పాటు అవసరమైన పరికరాలను 50శాతం రాయితీతో అందించటం అభినందనీయం అని కొనియాడారు. వరద సమయంలో సామాజిక బాధ్యతగా అత్యాధునిక పరికరాలతో ఉచిత క్యాంప్‌ ఏర్పాటు చేసిన కొల్లి సీతారామ్‌ను అభినందించారు.ఈ కార్యక్రమం లో నవనీతం సాంబశివరావు, షేక్ బాషా,వల్లభనేని సతీష్ వెలుగంటి లక్ష్మణరావు, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *