Breaking News

కాలుష్య రహిత సమాజానికై అవగాహన

-సెల్ఫీ పాయింట్స్ తో ప్రజాదరణ
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ప్రజల భాగస్వామ్యంతో  స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో స్వచ్ఛత గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మారీస్ స్టెల్లా  కాలేజ్  వద్ద షాపర్స్ స్టాప్  మాల్, గురునానక్ కాలనీ లోని ఉషోదయ సూపర్ మార్కెట్ వద్ద,  పంట కాలవ రోడ్డు దగ్గర నారాయణ స్కూల్, వన్ టౌన్  గాంధీజీ హై స్కూల్, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద సెల్ఫీ స్టాండ్లను ఏర్పాటు చేశారు. ఈ సెల్ఫీ స్టాండ్ ల ద్వారా ప్రజలు సెల్ఫీ దిగడమే కాకుండా  స్వచ్ఛత వైపు వారి మద్దతుని చాటి చెప్పారు వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటమే కాకుండా విజయవాడ నగరాన్ని పరిశుభ్రత వైపు ముందడుగులు వేస్తూ స్వచ్ఛ సర్వేక్షన్ లో ప్రథమ స్థానం ప్రథమ స్థానం కైవసం చేసుకునేలా  వారి మద్దతు ఇచ్చారు. నాలుగవ డివిజన్, శ్రీనివాసనగర్, బ్యాంక్ కాలనీ నందు ప్రజలకు స్వచ్ఛత హీసేవ కార్యక్రమం గురించి అవగాహన కల్పించేందుకు కళా జాతర బృందం చే ప్రజలకు అవగాహన కల్పించారు.

ఇందులో భాగంగా ఈ బృందం ప్రజలకు  అర్థమయ్యే రీతిలో కళ ద్వారా నాట్యమాడుతూ బుర్రకథ చెబుతూ, పరిసరాల పరిశుభ్రత, సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛత, కాలుష్యాన్ని తగ్గించటం, ప్రజలు చేయవలసిన పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటడం ఇలాంటి విషయాలపై నాటకం ద్వారా నాట్యం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ జానకిరామ్, సానిటరీ సెక్రటరీలు, స్వచ్ఛ సర్వేక్షన్ సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *