విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా ఆరవ రోజు అనగా 08/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 31493 మందికి గాను 27937 మంది అభ్యర్థులు అనగా 88.70 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 67 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 16286 మందికి గాను 14349 మంది అనగా 88.11 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 65 సెంటర్లలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పరీక్షలకు 15207మందికి గాను 13590 మంది అనగా 89.37 శాతం మంది హాజరయ్యారు. ఆరవ రోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి అని ఏపీ టెట్ కన్వీనర్ ఎం.వి. కృష్ణా రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేసారు .
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News