గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో వివిధ కేటగిరులుగా ఆస్తిపన్ను విధింపు, వసూళ్లు, సమగ్ర రహదారి నిర్వహణ విధానం, ఆర్ధిక వనరులు, ముఖ్యమైన ప్రాజెక్ట్ లను గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బృందం గురువారం పరిశీలించింది. ఒడిశా మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లలో అమలు చేస్తున్న కార్యక్రమాల స్టడీ టూర్ లో భాగంగా గురువారం జిహెచ్ఎంసిలో అమలు చేస్తున్న వివిధ పధకాలు, ప్రాజెక్ట్ లను నగర కమిషనర్ బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా కమిషనర్ బృందానికి తొలుత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో నగర జనాభా, నివాస, కమర్షియల్ భవనాలు, ఆస్తి పన్ను విధింపు, వసూళ్ళు వివరాలను నోడల్ అధికారులు వివరించారు. హైదరాబాదులో అమలు చేస్తున్న సమగ్ర రహదారి నిర్వహణ విధానాన్ని కమిషనర్ బృందం పరిశీలించి, విధి విధానాలను తెలుసుకున్నారు. ఆస్తి పన్ను పరిధిలోకి వచ్చే భవనాలను భౌగోళిక సమాచార వ్యవస్థ (జిఐఎస్) ద్వారా పర్యవేక్షణ తీరును పరిశీలించారు. ప్రాజెక్ట్ ల పరిశీలనలో భాగంగా హైదరాబాదు ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ పాయింట్, ఆర్.డి.ఎఫ్, విండ్రో కంపోస్ట్ యూనిట్ లను సమగ్రంగా పరిశీలించి, నిర్వహణ, పనితీరు, ఖర్చులను అధికారులు వివరించారు.
Prajavartha Online Telugu News