-తొందర్లో మూడు డీసిల్టేషన్ పాయింట్ల నుండి ఉచిత ఇసుక సుమారు 1,37,686 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డు పాయింట్ నందు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి పారదర్శకంగా ఇసుక అందేలా, ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టిందని, తొందర్లో మూడు డీసిల్టేషన్ పాయింట్ల నుండి సుమారు 1,37,686 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డు పాయింట్ల నందు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇసుక అక్రమ రవాణా ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. వీరితో పాటుగా జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి పారదర్శకంగా ఇసుక అందేలా ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టిందని, ఈ ఉచిత ఇసుక విధానంలో గత మాసాలలో పలు డిపోలు ద్వారా ఇసుక అందుబాటులో ఉంచగా ప్రజలు వినియోగించు కున్నారని తెలుపుతూ జిల్లాలో గుర్తించిన మూడు డీసిల్టేషన్ పాయింట్లలో రెండు పెళ్లకూరు మండలం నందు, మరొకటి గూడలి కోట మండలం నందు ఏర్పాటుకు ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు వచ్చాయని అధికారులు తెలుపగా, స్వర్ణముఖి నది పరీవాహక ప్రాంతం నందు తొందర్లో పాలచూర్ అనికట్ అప్ స్ట్రీమ్ పుల్లూరు గ్రామం, పెళ్లకూరు మండలం నందు 1.920 హెక్టార్ లలో 28782 క్యూబిక్ మీటర్లు, 43173 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంటుందని, పాలచూరు అనికట్ డౌన్ స్ట్రీమ్, దిగువ కలువకూరు గ్రామం పెళ్లకూరు మండలం నందు 1.821 హెక్టార్ లలో 27309 క్యూబిక్ మీటర్లు, 40963 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంటుందని, స్వర్ణ ముఖి బ్యారేజి సమీపంలో గూడలి గ్రామం, కోట మండలం నందు 2.300 హెక్టార్ ల విస్తీర్ణంలో 35700 క్యూబిక్ మీటర్లు, 53550 మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులోకి రానున్నదని తెలిపారు. డీ సిల్టేశన్ పాయింట్ వద్ద ఇసుక తోడడానికి, రవాణాకు ఏజెన్సీ ని అపాయింట్ చేయడానికి నిబంధనల మేరకు జలవనరుల శాఖ వారు తొందర్లో చర్యలు తీసుకోవాలని సూచించారు. డీ సిల్టేషన్ పాయింట్ నుండి ట్రాక్టర్లలో దగ్గరలో గుర్తించిన శాండ్ స్టాక్ యార్డ్ సేల్ పాయింట్ నందు డంప్ చేయాల్సి ఉంటుందని, అక్కడ నుండి వినియోగదారులు ఆన్లైన్ లో ఇసుక బుక్ చేసుకుని, అందులో సూచించిన సమయంలో అదే వాహనం తీసుకుని వచ్చి ఇసుక కమిటీ నిర్ధారించిన నామ మాత్రపు రుసుము మేరకు ఇసుక తీసుకు వెళ్లాల్సి ఉంటుందనీ తెలిపారు. స్టాక్ పాయింట్ నందు సీసీ కెమెరాలు ఏర్పాటు, 24X7 పోలీస్ గస్తీ, పోలీస్ చెక్ పోస్ట్ పాయింట్ ఏర్పాటు, గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది విధులు కేటాయించడం, అలాగే రెవెన్యూ శాఖ నుండి అధికారిని ఇంఛార్జి ఏర్పాటు, పర్యవేక్షణ ఉండాలని అన్నారు. కంప్యూటర్, ప్రింటర్ తదితర ఐటి, ఇతర సామాగ్రి ఏర్పాటు సేల్ పాయింట్ నందు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పట్టా భూమి లేదా డికేటి భూమి నందు ఇసుక ఉన్న వాటిని జిల్లా గనుల శాఖ అధికారి వారు నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సదరు భూములను రెవెన్యూ, గనుల శాఖ, కాలుష్య నియంత్రణ, జలవనరుల శాఖ, భూ గర్భ జలాల శాఖ, వ్యవసాయ శాఖ వారు సంయుక్తంగా తనిఖీ చేయాలని సూచించారు.
ఇసుక రుసుము, ట్రాన్స్పోర్ట్ తదితర వాటి వివరాలు అన్ని సచివాలయాల్లో, తాసిల్దార్, ఎంపిడిఓ మరియు పోలీస్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రిజిస్టర్ చేసుకున్న వాహనం మాత్రమే తీసుకెళ్ళాల్సి ఉంటుందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తప్పక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే జిల్లాలో 8 ఓపెన్ శాండ్ రీచ్ లను అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఆర్డీఓ శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, జిల్లా గనుల శాఖ అధికారి బాలాజీ నాయక్, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి మురళీమోహన్, జిల్లా పంచాయతీ అధికారిని సుశీల దేవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్ కుమార్, ఈ ఈ పిసిబి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News