తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శెట్టిపల్లి భూముల సమస్యల పరిష్కార కోసం వెంటనే భూ సర్వే పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం జాయింట్ శుభం బన్సల్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, రెవెన్యూ,తుడా అధికారులు, నగర పాలక సంస్థ, ఇంజనీరింగ్, ప్లానింగ్, అధికారులు, శెట్టిపల్లి సాధన సమితి ప్రతినిధులతో కలసి శెట్టిపల్లి పరిధిలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శెట్టిపల్లి భూములు సమస్యల పరిష్కార కోసం రెవెన్యూ,ల్యాండ్ & సర్వే, మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల సమన్వయ చేసుకొని భూములను సర్వే పూర్తి చేయాలన్నారు. అలాగే శెట్టిపల్లి సాధన కమిటీ సభ్యులు,ప్రజల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వారికి కలెక్టర్ చూచించారు.ఈ ప్రాంతం లో ఎప్పటి నుండి ఇక్కడ ఎంత మంది ప్రజలు నివాసాలు ఉన్న వారిని గుర్తించాలని వి ఆర్ ఓ ను ఆదేశించారు.
ప్రస్తుతం ఇక్కడ నివాసాలు ఉన్న వారికి తగిన న్యాయమైన చేయడం జరుగుతుందని కలెక్టర్ వారికి చూచించారు.
ఈ ప్రాంతంలో ఎక్కువుగా మట్టిని తీసుకెళుతున్నారని,అడ్డు చెప్పడంతో మా పై దౌర్జన్యం చేస్తున్నారని అక్కడ ఉన్న ప్రజలు కలెక్టర్ కు చెప్పగా,కలెక్టర్ జెసి,కమిషనర్ మట్టి తవ్వకాల ప్రాంతాలను పరిశీలించి, ఇక పై ఎవ్వరైనా మట్టిని తరలించే వారి పై క్రిమినల్ కేసులు పెట్టడం, కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మట్టిని తరలించు కుండా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ ను,వి ఆర్ ఓ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తుడా ఎస్ ఈ కృష్ణారెడ్డి,ల్యాండ్ అక్విటీన్స్ అధికారిణి సుజన, ఈ ఈ రవీంద్రయ్య, టి పి ఓ. దేవి కుమారి,ఆర్ డి ఓ మరియు డిప్యూటీ కలెక్టర్,రామ్ మోహన్, తహశీల్దార్ భాగ్యలక్ష్మి, డిటి అశోక్,వి ఆర్ ఓ లు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News