-రైతు బజార్లు రిటైల్ దుకాణాలలో లోసరసమైన ధరలకే నిత్యావసర కందిపప్పు,వంట నూనెలు : జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే వంట నూనెలు వినియోగదారుల కు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలసి తిరుపతి పట్టణంలోని బేరు వీధిలోని గోపి కృష్ణ ఆయిల్ స్టార్ నందు రూ.135 విలువగల పాముయిల్ ను 117 రూపాయలకు మరియు 145 రూపాయల విలువగల సన్ ఫ్లవర్ ఆయిల్ ను 128 రూపాయలకు వినియోగదారుల కు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇద్దరు కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పట్టణం లోని రైతు బజార్లు మరియు పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాలలో సరసమైన ధరల లో నాణ్యమైన సరకుల వినియోగదారుల కు అమ్మకం చేయాలన్నదే ప్రభుత్వ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
వినియోగదారుల వ్యవహరములు ఆహార మరియు పౌరసరఫరాల శాఖ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ము ఆదేశాల మేరకు తిరుపతి పట్టణంలో గోపి కృష్ణ ఆయిల్ స్టోర్స్, ఎస్ ఎస్ ఆయిల్ స్టోర్స్ ఎస్ఎస్ బ్రదర్స్, అమర,మురుగన్,సీత ఎంటర్ప్రైజెస్, భాస్కర, వాసవి ఆయిల్ స్టోర్స్ మరియ మంగళం రోడ్డు లోని డి మార్ట్, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రిలయన్స్ మార్ట్ లలో లీటర్ 135 రూపాయలు ఉన్న పామాయిల్ ను 117 రూపాయల కు మరియు 145 రూపాయలు ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు 128 రూపాయిలకు గురువారం నుండి వినియోగదారులు పై స్టోర్స్ ల లో కొనుగోలు చేసుకోవచ్చని జిల్లా పౌరసరఫరాల అధికారి శేషాచలం రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ జయరామ్, ప్రతాప్,గోపీకృష్ణ ఆయిల్ స్టార్ ఓనర్,వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News