విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా ఎనిమిదవ రోజు అనగా 10/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 28477 మందికి గాను 25487 మంది అభ్యర్థులు అనగా 89.50 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 57 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 12866 మందికి గాను 11501మంది అనగా 89.39 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 58 సెంటర్లలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పరీక్షలకు 15611 మందికి గాను 13986 మంది అనగా 89.59 శాతం మంది హాజరయ్యారు. ఎనిమిదవ రోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల విభాగంలో పరీక్షలు అన్ని ముగిసిన తర్వాత వారి ప్రాథమిక కి మరియు రెస్పాన్స్ షీట్స్ విడుదల చేస్తారు అని ఏపీ టెట్ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేసారు .
Tags vijayawada
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News