Breaking News

అవినీతిరహిత గ్రామ పాలనకు పెద్ద పీట

-ప్రజలకు సంబంధించిన సమస్యలు వినడానికి నా కార్యాలయ తలుపులు తెరిచే ఉంటాయి
-కూటమిలో ఉన్న మనం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి నిలుపుదాం… అందరి నమ్మకాన్ని నిలబెట్టుకొందాం
-జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 
-పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర పార్టీల నాయకులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘లంచం అనే మాట వినపడకుండా, ఎవరి నోట పలకని విధంగా పాలనలో మార్పు తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అనేది రాష్ట్రానికి మూలం. కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల బాధ్యతలను తీసుకున్నాం. సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సమష్టిగా అన్ని శాఖలను ముందుకు తీసుకెళ్లేలా పని చేద్దాం. దీని కోసం జనసేన పార్టీ శ్రేణులు, నాయకులు ప్రణాళికతో ప్రభుత్వానికి తగిన సహకారం అందజేయాల’ని జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పాలనలో రాజీ లేకుండా, రూల్ బుక్ నిబంధనలకు అనుగుణంగా ఇటీవల బదిలీలు చేశామని చెప్పారు. అవినీతికి తావు లేకుండా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఇటీవల చేసిన బదిలీల్లో 20 ఏళ్లకు పైబడి ఒకే దగ్గర పాతుకుపోయిన వారికి స్థాన చలనం కలిగించామని తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు నాయకులు పవన్ కళ్యాణ్ సమక్షంలో శనివారం పార్టీలో చేరారు. వారికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె  క్రాంతి,ఆమె భర్త బి. రవి కిరణ్, అమలాపురానికి చెందిన కల్వకొలను తాతాజీ, గుంటూరుకు చెందిన చందు సాంబశివరావు, గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు నిమ్మల వెంకట రమణ,  సంకూరి శ్రీనివాసరావు, ఇర్రి ధనలక్ష్మి, అయిశెట్టి కనకదుర్గ… అలాగే జగ్గయ్యపేట మున్సిపాలిటి కౌన్సిలర్లు కొలగాని రాము, కాశీ అనురాధ, తుమ్మల ప్రభాకర్ రావు, కాటగాని శివ కుమారి, తన్నేరు నాగమణి, సాధుపాటి రాజా, పాకలపాటి సుందరమ్మ,  షేక్ సిరాజున్ మోరే సరస్వతి, పండుల రోశయ్య, కోఆప్షన్ మెంబర్లు చైతన్య శర్మ, ఖాదర్ బాషా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆకుల బాజీ,  వీరయ్య చౌదరి, పెడన నియోజకవర్గం నుంచి ఎంపీటీసీ జక్కా ధర్మారాయుడుతోపాటు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు, నాయకులు పార్టీలో చేరారు.

పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలి
పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా నాయకులు బాధ్యతగా పని చేయాలని ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘‘సోదరి క్రాంతి గారు ఎన్నికల సమయంలో వచ్చారు. అప్పుడు సభలో చెప్పాను… కుటుంబమంతా కలసి ఉండాలి, ఇప్పుడు వద్దు అన్నాను. అందరూ కలసి ఉండాలి అని కోరుకొనేవాడిని. సోదరి వేచి చూశారు. క్రాంతి, ఆమె శ్రీవారు రవి కిరణ్ చేరారు.
ఇటీవల జరిగిన బదిలీల్లో కూటమి ఆయా శాఖల నిబంధనల ప్రకారం బదిలీలు చేశాం. అయితే కొన్ని చోట్ల అడిగిన ప్రాంతాలకు వారిని బదిలీ చేయలేకపోయాం. కూటమి ప్రభుత్వంలో జనసేన ఉంది. ప్రభుత్వంలో మనం భాగం. ప్రజలకు సంబంధించిన సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే, వెంటనే వాటి పరిష్కారానికి పనిచేస్తాను. నాయకులు, పార్టీ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న సమస్యలను తీర్చడంపై దృష్టి సారించాలి. జనసేన పార్టీని ఇంతమంది నాయకులు బలంగా నమ్మతున్నారంటే మనంపై ఉన్న నమ్మకం అని గుర్తుంచుకోవాలి. దాన్ని నిలబెట్టుకునేలా పని చేద్దాం.
అవినీతికి తావు లేకుండా, ప్రజలకు జవాబుదారీతనంతో ప్రభుత్వ పాలన ఉండాలి. అధికారుల సచ్ఛీలత, వారి పనితనం, నిజాయతీలను పరిగణనలోకి తీసుకొని తగిన బాధ్యతలను అప్పగిస్తాం. ఇటీవల జరిగిన బదిలీలు రాజకీయాలకు అతీతంగా ఎప్పుడులేని విధంగా పారదర్శకంగా జరిగాయని అధికారులు చెప్పడం ఆనందంగా ఉంది. డిప్యూటీ సీఎం కార్యాలయానికి ప్రజలకు సంబంధించిన ఏ సమస్య తీసుకొచ్చినా దాని పరిష్కారం కోసం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను. ఇటీవల పల్లెపండుగ ప్రారంభ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తాగునీటి కలుషిత సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగాన్ని నీటి పరీక్షలకు పంపాం. మొదటి విడతలో నందివాడ మండలంలో రూ.91 లక్షలతో ఫిల్డర్ బెడ్లు, ఇతర పనులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ప్రజలకు అవసరం అయిన సమస్యలను తీరుస్తూ వారి మన్ననలు పొందేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ నిలబెట్టుకునే విధంగా పాలన సాగించాలి. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సామినేని ఉదయభాను మొదటి నుంచి విలువలకు కట్టుబడి రాజకీయం చేశారు. అలాంటి వ్యక్తి పార్టీలోకి రావడం ఆనందం కలిగించింది. ఆయన నాయకత్వంలో జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, పార్టీ ఉపాధ్యక్షులు బి. మహేందర్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, పార్టీ కార్యక్రమాల కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ నాయకులు మండలి రాజేష్,  పంచకర్ల సందీప్, వడ్రాణం మార్కండేయబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మంత్రి గొట్టిపాటి అధ్య‌క్ష‌త‌న‌ ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం

-డిస్కంలను లాభాల బాట పట్టించే అంశాలపై మంత్రుల చర్చ -బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని వెయ్యి నుంచి రెండు వేల మెగావాట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *