విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్ నేహ్రూ నగర్ శిఖామణి సెంటర్ కి చెందిన కొండవీటి అనిల్ మెదడు సంబంధిత వ్యాధి కి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. సీఎంఆర్ఎఫ్ కి ఎంపి కేశినేని శివనాథ్ సాయంతో ఆర్జీ పెట్టుకోగా, మంజూరైన లక్షా యాభైవేల రూపాయల చెక్కును ఎంపి కేశినేని శివనాథ్ మంగళవారం గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో కొండవీటి అనిల్ కుటుంబ సభ్యులు బి.కార్తీక్ , కె.భగత్ చందు కి అందజేశారు. సిఎంఆర్ఎఫ్ మంజూరు అయ్యే విధంగా సాయం చేసి ఆదుకున్నందుకు వారు ఎంపి కేశినేని శివనాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News