Breaking News

బాధితుల‌కి ల‌క్షా యాభై వేల రూపాయ‌ల సీఎంఆర్ఎఫ్ చెక్కును అంద‌జేసిన ఎంపి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 7వ డివిజ‌న్ నేహ్రూ న‌గర్ శిఖామ‌ణి సెంట‌ర్ కి చెందిన కొండ‌వీటి అనిల్ మెద‌డు సంబంధిత వ్యాధి కి ప్రైవేట్ ఆసుప‌త్రిలో ఆప‌రేష‌న్ చేయించుకున్నాడు. సీఎంఆర్ఎఫ్ కి ఎంపి కేశినేని శివ‌నాథ్ సాయంతో ఆర్జీ పెట్టుకోగా, మంజూరైన ల‌క్షా యాభైవేల రూపాయ‌ల చెక్కును ఎంపి కేశినేని శివ‌నాథ్ మంగ‌ళ‌వారం గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో కొండ‌వీటి అనిల్ కుటుంబ సభ్యులు బి.కార్తీక్ , కె.భ‌గ‌త్ చందు కి అంద‌జేశారు. సిఎంఆర్ఎఫ్ మంజూరు అయ్యే విధంగా సాయం చేసి ఆదుకున్నందుకు వారు ఎంపి కేశినేని శివ‌నాథ్ కి కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *