-ఎవరి ఇళ్లూ కూల్చరని ఎంపి హామీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గొల్లపూడి ప్రాంతంలో రామరాజు నగర్, పాత రైల్వే కట్ట దగ్గర నివాసం వుంటున్న తమ ఇళ్లు రైల్వే అధికారులు తొలగించకుండా చూడాలని ఆ ప్రాంత నివాసితులు పదుల సంఖ్యలో మంగళవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి వారి బాధ వెల్లబోసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఎవరికీ అన్యాయం జరగదని పాత రైల్వే కట్ట నివాసితులకు ఎంపి కేశినేని శివనాథ్ అభయం ఇచ్చారు. రామరాజునగర్ స్వయంగా వచ్చి అక్కడ పరిస్థితిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ముందుగా ఈ సమస్యకు తాత్కలిక పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని…ఆ తర్వాత శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఎవరు అధైర్య పడవొద్దని.. దైర్యంగా వుండాలని ఎవరి ఇళ్లు కూల్చరని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపాలకృష్ణ, గొల్లపూడి మండలం మాజీ వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, మండల మాజీ ఎంపిపి జగన్ మోహన్, నివాసితులు మురళీకృష్ణ, మన్ బోల్, రాజా, భాస్కర్, యల్లాయమ్మ, రాహేలమ్మలతో పాటు తదితరలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News