Breaking News

“జాబ్ మేళా”

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.02.11.2024 శనివారం  పామర్రు నియోజకవర్గం కురుమద్ధాలి లో గల కొసరాజు పూర్ణ చంద్రరావు కమ్యూనిటీ హాల్ ఆవరణలో గల రూరల్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా వొకేషనల్ ఉపాధి కల్పన అధికారి సత్య బ్రహ్మం మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి dr. పి.నరేష్ కుమార్ సంయుక్తంగా తెలియజేసారు.

ఈ జాబ్ మేళాలో, కురాకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కంపెనీ లలో గల ఉద్యోగాలకు 10వ తరగతి, ఇంటర్, ఫార్మసీ, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు వారు అర్హులని, ఎంపిక అయిన వారికి నెలకు సుమారు రూ.12,000/- నుండి రూ.29,000/- ల వరకు వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, నవంబర్ 2న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. నరేష్ కుమార్ గారు తెలిపారు.

ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in లింక్ నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్ మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 80743 70846 నంబర్ను సంప్రదించాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *