Breaking News

రోడ్ల ప్యాచ్ వర్క్ లు పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్దం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డిశంబర్ 15 నాటికి రోడ్ల ప్యాచ్ వర్క్ లు పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశామని, అందులో భాగంగా ఇప్పటి వరకు గుర్తించి 3 వేల ప్యాచ్ వర్క్ ల్లో షుమారు 5 వందలు పూర్తి చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏ నసీర్ అహ్మద్ గారితో కలిసి పాత గుంటూరు బాలాజీ నగర్ మెయిన్ రోడ్ మరమత్తు పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో రహదారులపై వార్డ్ సచివాలయాల వారీగా 3 వేల వరకు ప్యాచ్ లు, రోడ్ మరమత్తు చేయాల్సిన వాటిని గుర్తించామని, వాటికి డివిజన్ల వారీగా అంచనాలు సిద్దం చేసుకొని, డిశంబర్ 15 నాటికి పూర్తి స్థాయిలో చేపట్టడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామని తెలిపారు. ఇప్పటికే 5 వందల వరకు మరమత్తు చేశామని పేర్కొన్నారు. ప్రజలకు రోడ్ల మీద గోతుల వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వాటి మరమత్తులపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
ఎంఎల్ఏ నసీర్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ప్రజలు గోతులతో కూడిన రోడ్ల వలన తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తుందన్నారు. జిఎంసి అధికారులు నియోజకవర్గంలోని రోడ్లను పరిశీలించి, గోతులు సరి చేయడం, బాగా పాడైన వాటికి శాశ్వత ప్రాతిపదికన మరమత్తులు చేపట్టాలన్నారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో నూతన డ్రైన్లు, రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పి.జ్యోతి, వై.అశోక్, ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ నాగభూషణం, ఏఈ వెంకటేశ్వర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *