Breaking News

మహిళలలో బ్రెస్ట్ క్యాన్సర్ స్వీయ పరీక్ష పోస్టర్లు విడుద ల చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి మంగళవారం స్థానిక కలెక్టరేట్లో మహిళ ల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ కు సంబంధించిన స్వీయ పరీక్ష పోస్టర్ ను ఆరోగ్యశాఖ , పరివర్తన స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులతో కలిసి విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కాన్స్టోరియమ్ ఆఫ్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సి – హాయ్ ) సంస్థ మరియు పరివర్తన స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా వ్యాప్తంగా మహిళ ల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారు స్వీయ పరీక్ష చేసుకొని దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ లో ఉచితoగా పరీక్షలు చేసికొని చికిత్స పొందాలని, అలాగే ప్రతి మహిళ తమ ఆరోగ్య సంరక్షణ కోసం బ్రెస్ట్ క్యాన్సర్ హెల్ప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని తద్వారా మరింత అవగాహన చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంఎచ్ఓ డా.శ్రీహరి, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి అమర్నాథ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *