-తన ప్రసంగంలో ఎంపి కేశినేని పనితీరును కొనియాడిన సీఎం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారంలోకి వచ్చిన నాలుగైదు నెలల్లోనే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వరల్డ్ రికార్స్ సృష్టించి రాష్ట్రానికి గిన్నిస్ బుక్ లో చోటు దక్కే విధంగా కృషి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతం. సీఎం చంద్రబాబు విజనరీలో భాగంగా అమరావతి రాజధాని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు ప్రారంభించిన సీ ప్లేన్ విజయవాడకి ఒక మణిహారం అని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
పున్నమి ఘాట్ వద్ద కృష్ణానదీ తీరాన విజయవాడ – శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రారంభోత్సవ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం ఎంతో ఆనందంగా వుందన్నారు. కేంద్రం సహకారంతో మరెన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు కానున్నాయన్నారు.విజయవాడ కృష్ణా నదీ తీరాన సీ ప్లేన్ ప్రారంభించటం విజయవాడ , అమరావతి ప్రాంత ప్రజలకు గర్వకారణమని తెలిపారు. పలు దేశాలలో పర్యాటక రంగాన్ని కొత్త మలుపు తిప్పిన సీ ప్లేన్ లు రాష్ట్రంలో ప్రారంభం కావటం ఆహ్వానించదగ్గ పరిణామన్నారు. సీ ప్లేన్స్ ప్రాజెక్టుతో విజయవాడ శ్రీశైలం మధ్య ఆధ్యాత్మిక బంధం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మరో మూడు నెలల్లో అందుబాటులోకి రాబోయే సీ ప్లేన్ ద్వారా భక్తులు ఒకే రోజులో అమ్మవారి దర్శనం, శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునే భాగ్యం కలుగుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తో కలిసి పాల్గొన్నారు. వీరిద్దరూ ముందుగా సీ ప్లేన్ ను ఎక్కి పరిశీలించారు. అనంతరం ప్రాంగణానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకి ఎంపి కేశినేని శివనాథ్ మంత్రులు, అధికారులతో కలిసి స్వాగతం పలికారు.
సీఎం ప్రశంసలు
సీఎం చంద్రబాబు నాయుడు సీ ప్లేన్ ప్రారంభోత్సవ సభలో ప్రసంగిస్తూ ” గత విజయవాడ ఎంపి ఎప్పుడు, ఏ పనికి తిరిగే వాడు కాదు…చిన్న ఈవెంట్ నుంచి ఏ పని జరిగినా ముందుండే వ్యక్తి విజయవాడ ఎంపి…అలాంటి ఎంపి కేశినేని చిన్ని ” అంటూ కొనియాడారు.
Prajavartha Online Telugu News