Breaking News

ఆటోన‌గ‌ర్ అభివృద్ది చేసి యువ‌త‌కి ఉపాధి చూపించ‌ట‌మే నా ధ్యేయం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన ఆటోన‌గ‌ర్ ఐలా నాయ‌కులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్.ఎస్.ఎమ్.ఈ ద్వారా క్ల‌స్ట‌ర్ల లు ఏర్పాటు చేసుకుంటే తొంభై శాతం స‌బ్సిడీ వ‌చ్చే అవ‌కాశం వుంది. ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుని ఆటోమొబైల్ అసోసియేష‌న్స్ క్ల‌స్ట‌ర్స్ గా ఏర్పాడాల‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ పిలుపునిచ్చారు.

గ‌త మూడు రోజులుగా ఆటోన‌గ‌ర్ లోని ఆటో మొబైల్ అసోసియేష‌న్స్ తో స‌మావేశం అవుతూ వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్న ఎంపి కేశినేని శివ‌నాథ్ గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో శనివారం ఆటోన‌గ‌ర్ ఐలా (ఇండ‌స్ట్రీయ‌ల్ ఏరియా లోక‌ల్ అథార్టీ)నాయ‌కులు, ఆటో ఎల‌క్ట్రిక‌ల్ అసోసియేష‌న్ , ది విజ‌య‌వాడ టైర్ రీ ట్రేడ‌ర్స్ అండ్ వ‌ల్క‌నైజ‌ర్స్ వెల్పేర్ అసోయేష‌న్ నాయ‌కుల‌తో స‌మావేశం అయ్యారు.

ఐలా నాయ‌కులు జి.వో నెంబ‌ర్ 5, 6 లు ర‌ద్దు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.ఈ జీవోల వ‌ల్ల అద‌నంగా ట్యాక్స్ చెల్లించాల్సి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. ఈ స‌మ‌స్య‌పై ఎంపి కేశినేని శివ‌నాథ్ సానుకూలంగా స్పందించారు. ఆటోన‌గ‌ర్ కి లారీలు వ‌స్తున్న మ‌హానాడు ర‌హ‌దారి తో పాటు.. మ‌రో ప్ర‌త్యామ్నాయ మార్గం సూచిస్తే అధికారుల‌తో మాట్లాడి ఆ ర‌హ‌దారిని అభివృద్ది చెప్పిస్తాన‌న్నారు.

అలాగే బి.ఎస్.6 మోడ‌ల్ వెహిక‌ల్స్ రావ‌టంతో ప‌నులు త‌గ్గిపోయాయ‌ని. ఆ కంపెనీల‌తో మాట్లాడి టెక్నిక‌ల్ గా ట్రైనింగ్ ఇప్పించాల్సిందిగా ఆటో ఎల‌క్ట్రిక‌ల్ అసోసియేష‌న్ నాయ‌కులు ఎంపి కేశినేని శివ‌నాథ్ ను కోరారు. సి.ఎస్.ఆర్ నిధులు ఉప‌యోగించి ప్రముఖ లారీ కంపెనీల ప్ర‌తినిధుల‌తో ట్రైనింగ్ ఇప్పించే విధంగా సిల్క్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాన‌ని చెప్పారు.

ఆటో మొబైల్ రంగంలో వున్న అసోసియేష‌న్స్ లో వున్న నాయ‌కులు క్ల‌స్ట‌ర్స్ గా ఏర్పడాల‌ని సూచించారు. క్ల‌స్ట‌ర్స్ గా ఏర్ప‌డితే సంబంధిత అధికారుల‌తో మాట్లాడి లోన్ వ‌చ్చే విధంగా కృషి చేస్తాన‌న్నారు.క్ల‌స్ట‌ర్స్ ఏర్పాటుకి సంబంధించిన‌ స్థ‌లం విష‌యంలో కూడా సాయం చేస్తాన‌ని తెలిపారు. ఆటోన‌గ‌ర్ సిల్క్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్స్ ద్వారా అప్ గ్రేడ్ చెంది, క్ల‌స్ట‌ర్ ఏర్పాటు చేసుకుని అభివృద్ది చెందితే ఎంతో మందికి ఉపాది క‌ల్పించే అవ‌కాశం వుంటుంద‌న్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అత్య‌ధిక మంది యువ‌త‌కి ఉపాధి చూపించ‌ట‌మే త‌న ధ్యేయ‌మ‌ని..ఆటో మొబైల్ రంగానికి రాబోయే కాలంలో మంచి భ‌విష్య‌త్తు వుంది…అందుకు త‌గ్గ‌ట్టుగా ఆటోన‌గ‌ర్ వ‌ర్క‌ర్స్ అంద‌రూ టెక్నిక‌ల్ గా అప్ గ్రేడ్ కావాల‌న్నారు.

ఆటోన‌గ‌ర్ (ఇండ‌స్ట్రీయ‌ల్ ఏరియా లోక‌ల్ అథార్టీ) ఐలా మాజీ చైర్మ‌న్ సుంక‌ర దుర్గా ప్ర‌సాద్, ఐలా సెక్ర‌ట‌రీ శివ‌నాగేశ్వ‌ర‌రావు, డిస్పోజ‌ల్ మోటార్ మార్చంట్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ గౌస్ ఖాన్, బాబూఖాన్, వ‌ర‌ప్ర‌సాద్, ఎఫ్‌.ఐ.బి సెక్ర‌ట‌రీ దేవ‌ర నాగేశ్వ‌ర‌రావు, ఐలా కో-ఆప్ష‌న్ స‌భ్యులు బాజీ హ‌రీష్, బాహుబ‌లేంద్ర కోటేశ్వ‌ర‌రావు, మెకానిక్ చింత‌ల సుబ్ర‌హ్మాణేశ్వ‌ర‌రావు, మెకానిక్ కొట్టి కృష్ణ‌, ది ఆటో మొబైల్ టెక్నిషియ‌న్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు గొల్ల‌పూడి నాగేశ్వ‌ర‌రావు, ఆటో ఎల‌క్ట్రిక‌ల్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ అబ్దుల్ క‌లాం, ఆటో ఎల‌క్ట్రిక‌ల్ అసోసియేష‌న్ వైస్ ప్రెసిడెంట్స్ కొడూరు ఆంజ‌నేయ వాసు, న‌డకుదిటి హ‌రిబాబు, సెక్ర‌ట‌రీ జాస్తి సురేష్‌, ది విజ‌య‌వాడ టైర్ రీ ట్రేడ‌ర్స్ అండ్ వ‌ల్క‌నైజ‌ర్స్ వెల్పేర్ అసోయేష‌న్ ప్రెసిడెంట్ ఎమ్.డి.రిజ్వాన్, సెక్ర‌ట‌రీ అబ్దుల్ అలీ అన్సారీ, వైస్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *