Breaking News

శ్యావ‌ల దేవ‌ద‌త్ కి శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడ‌క్ట్స్ స‌ర్టిఫికేష‌న్ అథారిటీ ఛైర్మ‌న్ గా నియ‌మితులైన శ్యావ‌ల దేవ‌ద‌త్ కు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ను శ్యావ‌ల దేవ‌ద‌త్ ఆదివారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా శ్యావ‌ల దేవ‌ద‌త్ కు అభినంద‌న‌లు తెల‌ప‌టంతో పాటు పుష్ప‌గుచ్ఛం అందించి శాలువాతో స‌త్క‌రించారు. ప్ర‌జ‌ల‌కి మ‌రింత సేవ చేసి మ‌రిన్నీ ఉన్న‌త ప‌ద‌వులు అందుకోవాల‌ని ఆకాంక్షించారు. తిరువూరు ఇన్ చార్జ్ గా వుండి త‌న‌కి టిక్కెట్ రాక‌పోయిన నిరాశ ప‌డ‌కుండా క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల నాయ‌కుడి పార్టీ గెలుపు కోసం కృషి చేశార‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ శ్యావ‌ల దేవ‌ద‌త్ ను కొనియాడారు. త‌న‌కి అభినంద‌న‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్ కు శ్యావ‌ల దేవ‌ద‌త్ కృతజ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలుగు యువ‌త ఎన్టీఆర్ జిల్లా అధికార ప్ర‌తినిధి మాద‌ల హ‌రిచ‌ర‌ణ్ కిట్టు, టిడిపి నాయ‌కులు అర్జున‌రావు, న‌వీన్, హుస్సెన్, సుమీత్, ఉమ‌ర్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *