Breaking News

ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు

ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి వీర పాండ్యన్ అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బుధవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, సంబంధిత రెవిన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ అధికారులతో కలసి ఉయ్యూరు మండలం చిన్నవోగిరాల గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ధాన్యం సేకరణ ప్రక్రియ పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యం విక్రయంలో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రంలో ధాన్యం తేమశాతం పరిశీలన, ఆన్లైన్లో నమోదు వంటి విషయాలపై పరిశీలన జరిపారు.

ఈ సందర్భంగా వీర పాండ్యన్ మాట్లాడుతూ వర్షం వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ సూచనలు వచ్చినందున కోసి ఆరబెట్టిన ధాన్యం మిల్లులకు త్వరగా తరలించేందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ధాన్యం త్వరగా మూవ్ చేయాలని ప్రత్యేకంగా చెప్పారని అన్నారు. మిషిన్లతో కోతలు జరుగుతున్నందున ఒకేసారి ఎక్కువ పరిమాణంలో మిల్లులకు వస్తున్నదని, ఇక్కడి మిల్లుల సామర్థ్యానికి మించి వస్తున్నందున, పక్క జిల్లాల మిల్లులకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా ధాన్యం రవాణాకు వాహనాల కొరత నివారణకు అవసరమైన అదనపు వాహనాలు కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం లోకల్ వాహనాలు జిపిఎస్ లేకపోయినా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపామని, ఆన్లైన్లో నమోదు చేయగానే, ధాన్యం రవాణా వాహనంగా వినియోగించుకుని, ట్రక్ షీట్ జనరేట్ అవుతుందని తెలిపారు. వర్ష సూచనలను బట్టి పొలంలో కోయకుండా ఉన్న పంటను కాపాడుకోవాలని రైతులకు సూచించినట్లు తెలిపారు. ధాన్యం తేమ శాతంలో మిల్లు వద్ద తేడాలు వస్తున్నట్లు రైతులు చెప్పిన సమస్యలపై మాట్లాడుతూ రైతు సేవా కేంద్రంలో నిర్ణయించిన తేమ శాతం ఫైనల్ అన్నారు.

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ గ్రామాల వారి ధాన్యం దిగుబడి తో పాటు, ఏ రోజు ఎంత పరిమాణం ధాన్యం లిఫ్ట్ చేయగలం వంటి వివరాలతో ప్రణాళిక బద్ధంగా ధాన్యం ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. మెషిన్ల కోత వల్ల ధాన్యం ఒకేసారి మిల్లులకు వస్తున్నందున అవసరమైన గోనె సంచులు, వాహనాలు అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్రామానికి నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఉయ్యూరు ఆర్డిఓ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు అధికారులతో వీర పాండ్యన్ సమీక్షించారు.

జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఉయ్యూరు ఆర్డిఓ షారోన్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ డి సృజన, డీఎస్ఓ వి. పార్వతి, తాసిల్దారు సురేష్ కుమార్, వ్యవసాయ శాఖ ఏవో నిస్సి గ్రేస్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *