విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బుధవారం ఉదయం శాఖాదిపతులతో కౌన్సిల్ ఎజెండా పై ప్రధాన కర్యాల్లయ్యం లో తమ ఛాంబర్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో కౌన్సిల్ ఎజెండా, అదనపు ఎజెండా లో ఉన్న ప్రతి ప్రతిపాదనను శాఖధిపతులతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర అభివృద్ది, ప్రజల సంక్షేమం కోసం సభ్యులు ఇచ్చిన ప్రతిపధనలను అధికారులందరు సహకించాలని, ప్రజల కోసం విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడు తోడుగా ఉండాలని అన్నారు. ఈ సమావేశం లో అడిషనల్ కమీషనర్ (ప్రాజెక్ట్స్ ) డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్రెడ్డి, ఇంచార్జి చీఫ్ మడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) సృజన, సూపరెండిటింగ్ ఇంజనీర్లు సత్యనారాయణ, సత్య కుమారి, అకౌంట్స్ ఎక్సమినర్ చక్రవర్తి, సెక్రెటరీ వసంత లక్ష్మి, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News