-పేదరికాన్ని అధిగమించే శక్తి విద్యకే ఉంది… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో చదువుల విప్లవం వచ్చిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాజీవ్ నగర్లోని రాజీవ్ గాంధీ మునిసిపల్ ప్రభుత్వ పాఠశాలలో మూడోరోజు జగనన్న విద్యాకానుక పథకాన్ని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం, అసమానతలను అధిగమించడంలో విద్య ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. విద్యతోనే మనిషి విలువ పెరుగుతుందన్నారు. జీవితాలను ఉన్నత …
Read More »Andhra Pradesh
ఆధునిక సాంకేతిక పద్ధతిలో శ్రీకొదండ రామాలయం పునః నిర్మాణ ప్రతిష్ట…
-దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరాముడు మనవాళికి అందించిన సందేశాన్ని, ఆయన ఆచరించి చూపిన జీవనశైలిని మనం అందిపుచ్చకొంటే, మన నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం పశ్చిమ నియోజకవర్గం హెచ్ బి కాలనీలో శివరామ భక్తమండలి అధ్వర్యంలో కొదండ రామాలయం పునః నిర్మాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో మంత్రి అతిధిగా పాల్గొన్నారు. భువనేశ్వరీపీఠం ఉత్తరాధికారి శ్రీ కమలానందభారతీ స్వామి సమక్షంలో …
Read More »వైభవంగా శ్రీ గాయత్రి మాత విగ్రహ ప్రతిష్ఠ… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-గాయత్రి సొసైటీ సేవలు అభినందనీయం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం సీతన్నపేటలోని గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు శ్రీ గాయత్రి మాత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా వేద మంత్రోచ్ఛరణల నడుమ కన్నులపండువగా జరిగింది. బుధవారం శ్రీ గాయత్రి సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని.. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి …
Read More »కోవిడ్ పరిస్థితులపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ స్కూళ్లు తెరిచినందున అక్కడ కోవిడ్ ప్రోటోకాల్స్ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలి: అధికారులకు సీఎం వైయస్.జగన్ స్పష్టం చేసారు. వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు దృష్టిపెట్టాలన్నారు. దీనిపై ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో …
Read More »ధ్రువీకరణ లేని వారి ఆస్తులపై రీ సర్వే ద్వారా హక్కులు… : కలెక్టర్ జె. నివాస్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామంలోని ప్రతి నివాసాన్ని,ఇంటి స్థలాలను రోవర్లతో డిజిటల్ విధానంలో కొలతలు వేశారని, యజమాని వివరాలను కంప్యూటర్లలో నమోదు చేసి..ఇంటి హక్కుల టైటిల్స్ సిద్ధం చేసి ఏళ్లుగా నివాసం ఉంటున్నా ఎలాంటి ధ్రువీకరణలేని వారికీ రీ సర్వే ద్వారా సదరు ఆస్తులపై హక్కులు ఏర్పడతాయని కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మచిలీపట్నం మండల పరిధిలోని పొట్లపాలెం గ్రామాన్ని సందర్శించారు. గ్రామ పంచాయితీ కార్యాలయంలోని రైతుభరోసా కేంద్రం వద్ద ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’ …
Read More »అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూల నిర్వహణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ డివిజన్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ జి, సూర్యసాయి ప్రవీణ్ చంద్ అధ్యక్షతన కమిటిచే ఇంటర్వ్యూలు నిర్వహించబడ్డాయి. మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ విజయవాడ డివిజన్లో సంబంధించి విజయవాడ – 1, 2, కంకిపాడు, ఉయ్యూరు, కంచికచర్ల, మైలవరం, నందిగామలకు చెందిన 7 ప్రాజెక్టుల్లో 10 అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు, 94 సహాయకురాలు, 2 మిని కార్యకర్తల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందుకు గాను …
Read More »గ్రామ సచివాలయాలు, రైతు భరోసాకేంద్రాలు, హెల్త్ క్లినిక్ లతో పాటు ఇతర ఉపాధి హామి నిర్మాణాలకు ప్రాధాన్యత క్రమంలో ఇసుక సరఫరా చేయాలి… : కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నిర్మాణాలు జరిగే గ్రామ సచివాలయాలు, రైతు భరోసాకేంద్రాలు, హెల్త్ క్లినిక్ లతో పాటు ఇతర ఉపాధి హామి నిర్మాణాలకు ప్రాధాన్యత క్రమంలో ఇసుక సరఫరా చేయాలని కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఉపాధి హామి పథకం ద్వారా ప్రారంభమైన నిర్మాణాల ప్రగతిని ఆయన సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ (ఆసరా) కె. మోహన్ కుమార్, పంచాయతీరాజ్ ఎస్స్ వీరాస్వామిలతో పాటు పంచాయతీరాజ్, ఇఇలు, డిఇలను ప్రత్యక్షంగా ఏఇలు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా …
Read More »వైఎస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్ లో రూ. 75 లక్షల వ్యయంతో నూతన పైపు లైన్ పనులను ప్రారంభించిన … : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : వై.ఎస్.ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో ఇళ్ళును సకల సౌకర్యాల లోగిళ్ళు గా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కైకలూరు లోని ఏలూరు రోడ్డు లోగల వైఎస్సార్ జగనన్న గ్రీన్ వీలేజ్ లో లబ్ధిదారులు కోసం రూ. 75 లక్షల వ్యయంతో నూతన పైపు లైన్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కైకలూరు పట్టణంలో వైఎస్సార్ జగనన్న గ్రీన్ విలేజ్ లో లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా …
Read More »ఆటపాక లోగల జాన్ పేట జగనన్న లే అవుట్ లో రూ.40 లక్షల తో మంచినీటి పైపులైన్ పనుల ప్రారంభించిన… : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో కైకలూరు సర్పంచ్ గా తాను ఆటపాక వాస్తవ్యులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చేసిన సంకల్ప బలమే ఈరోజు భగవంతుని దయతో శాసనసభ్యునిగా ఆ పనిని చెయ్యడానికి దోహదం చేసిందని భావిస్తున్నానని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావుఅన్నారు. మంగళవారం ఆటపాక పరిధిలో గల జాన్ పేటలోని నూతన జగనన్న లే అవుట్ లో రూ.40 లక్షల అంచనాతో మంచినీటి పైపులైన్ పనుల ప్రారంభోత్సవం కి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై సంపు నిర్మాణానికి భూమిపూజ చేసి..జే.సీ.బీ కి కొబ్బరికాయ కొట్టి …
Read More »విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సీఎం జగన్మోహనరెడ్డి శ్రీకారం… : మంత్రి కొడాలి నాని
-సమగ్ర వికాసమే లక్ష్యంగా బోధనలోనూ మార్పులు -విద్యారంగంలో సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ పథకాలు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సీఎం జగన్మోహనరెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని పిరమిడ్ ధ్యాన కేంద్రం అధ్యక్షురాలు జీ రాజకుమారి కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మ విద్య ద్వారా విద్యార్థులు ఆత్మసైర్యంతో జీవించాలనే లక్ష్యంతో గుడివాడ నియోజకవర్గం …
Read More »