Breaking News

Latest News

రాష్ట్రంలో మధ్య వినియోగ నియంత్రణ ప్రభుత్వ విధానం..

-ఈ విధానం అమలు ద్వారా 37 శాతం మద్యం, 77 శాతం బీర్లు అమ్మకాలు తగ్గినవి… -జంగారెడ్డిగూడెం సంఘటనలో మద్యం కారణంగానే మరణాలు సంబవించినవనే ఆధారాలు ఎక్కడా లేవు.. -బాధిత కుటుంబాల ఫిర్యాదు పై విచారణ చేపట్టాం.. -మూడు బాధిత కుటుంబాల ఫిర్యాదు పై విచారణ చేపట్టాం.. -గత ప్రభుత్వం కంటే 150 శాతం ఎక్కువగా శాంపిల్స్ పరీక్షలు నిర్వహించాం.. -రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజిత్ భార్గవ.. -ఎస్. ఇ. బి. కమిషనర్ వినీత్ బ్రిజిలాల్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

ప్రజలకు చేరువగా సమాజహితం కోరాలి…

-ఏపీడబ్ల్యూజేఎఫ్ డైరీల ఆవిష్కరణలో నేతల పిలుపు తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులు అత్యంత విలువైన సమాచారంతో ప్రజలకు చేరువగా ఉండాలని, పాత్రికేయ రంగం ద్వారా సమాజంలో వేళ్లూనుకుని పోయిన కుళ్లును పెకిలించాలని, ప్రజలకు చేరువగా సమాజహితం కోరుకోవాలని, అందుకు ఏపీ డబ్ల్యూ జే ఎఫ్ రూపొందించిన డైరీ లోని సమాచారం బాగా ఉపయోగపడుతుందని ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ అధ్యక్షుడు టి.రవీంద్రబాబు అన్నారు. ఆదివారం స్థానిక బోస్ రోడ్డులోని టాలెంట్ ఎక్స్ప్రెస్ కార్యాలయంలో ఏపీయూడబ్ల్యూజేఎఫ్ డైరీలను అధ్యక్షుడు తేళ్ల రవీంద్రబాబు, డివిజన్ …

Read More »

ఏప్రిల్ 3నుండి పద్యనాటక పోటీలు…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : కళల కాణాచి తెనాలి, వేద గంగోత్రి విజయవాడ సంయుక్త ఆథ్యర్యంలో ఏప్రిల్ 3నండి7వరకు ద్వితీయ జాతీయస్థాయి పద్యనాటక పోటీలు తెనాలి రామకృష్ణ కవికళాక్షేత్రంలో నిర్వహించనున్నామని కళల కాణాచి అద్యక్షుడు బుర్రా సాయిమాథవ్ తెలిపారు. స్థానిక CPI కార్యాలయమునందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ ఏప్రిల్ లో పౌరాణిక అక్టోబర్ లో సాంఘిక నాటక పోటీల నిర్వహణలో సాంప్రదాయంగా పౌరాణిక నాటక పోటీలు నిర్వహిస్తుందన్నారు. ఈ పర్యాయం తన తండ్రి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి …

Read More »

ప్రపంచంలో అత్యధిక పురాతన నాణేలు సేకరించే వారిలో నేను ఒకడిని… : పి. రత్న కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలో అత్యధిక పురాతన నాణేలు సేకరించే వారిలో నేను ఒకడనని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ పి. రత్న కుమార్ అన్నారు. ఆదివారం రాజరాజేశ్వరి పేటలో విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పి. రత్న కుమార్ మాట్లాడుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. భారతీయ గిన్నిస్ ప్రపంచ రికార్డులు చాలా తక్కువ. నేను 20 వేల కంటే ఎక్కువ నాణేలను సేకరించానన్నారు. దాదాపు 10 రికార్డు ఇప్పుడు నా …

Read More »

మానవత్వంతో పాటు సేవాదృక్పదాన్ని చాటుకున్న నాగిపోగు కోటేశ్వరరావు…

ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగిపోగు కోటేశ్వరరావు ఉంగుటూరు మండలం మదిరిపాడు గ్రామములో అంబేద్కర్,  జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు మెట్లు నిర్మించ టానికి 5000 రూపాయలు విరాళం ఇచ్చి మానవత్వంతో పాటు సేవాదృక్పదాన్ని చాటుకున్నారు.

Read More »

వంట నూనెల బ్లాక్ మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టి…

-ఎం.ఆర్.పి. కంటే అధిక ధరలకు విక్రయించిన దుకాణాలపై 889 కేసులు నమోదు.. -విజిలెన్సు దాడులతో ధరలు అదుపులోకి.. -అనధికార నిల్వలు, కృత్రిమ కొరత సృష్టిస్తే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తాం.. -ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినా, అవకతవకలు జరిగినా విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు చెందిన సమాచారాన్ని 94409 06254 నెంబరుకు వాట్స్ ఆఫ్, ఎస్.ఎం.ఎస్. ద్వారా సమాచారం అందించండి.. -కృష్ణా జిల్లాలో పాత స్టాక్ అమ్మకుండా నిల్వ ఉంచిన 5.67 మెట్రిక్ టన్నులు ప్రియా గోల్డ్ పామాయిల్ వంట నూనెలు స్వాధీనం …

Read More »

చేనేత సేవా కేంద్రం కార్యక్రమాలు అభినందనీయం…

-చేనేత జౌళి శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి -గాంధీనగర్ రైస్ మిల్లర్స్ హాలులో చేనేత ప్రదర్శన ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత రంగాన్ని ప్రోత్సహించటంలో చేనేత సేవా కేంద్రం కార్యక్రమాలు ఎంచదగినవని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి చదలవాడ నాగరాణి అన్నారు. విజయవాడ గాంధీనగర్ లోని రైస్ మిల్లర్స్ అసోసిషియేషన్ హాలులో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను ఆదివారం నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ చేనేత కార్మికులకు సంవత్సరమంతా పూర్తిస్ధాయి పని లభించగలిగేలా …

Read More »

ఇంధన సామర్థ్యం తో భక్తులకు మెరుగైన సౌకర్యాలు…

-పర్యావరణ పరిరక్షణ దిశగా టీటీడీ కీలక ముందడుగు -టీటీడీ దేవస్థానం పరిధిలో పెద్ద ఎత్తున ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలు -జాతీయ స్థాయిలో నెట్ జీరో ఫీజిబిలిటీ స్టడీ కి ఎంపికైన టీటీడీ -5,000 బీ ఎల్ డీ సి ఫ్యాన్లు అమర్చేందుకు టీటీడీ , ఏపీసీడ్కో ల మధ్య త్వరలో ఒప్పందం -బీ ఎల్ డీ సి ఫ్యాన్లు అమర్చితే ఏటా రూ 62 లక్షలు విలువైన 0. 88 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా -2070 నాటికి దేశంలో …

Read More »

స్పందనను వినియోగించుకోండి ..

-కమిషనర్ పి. రంజిత్ భాషా, ఐ. ఏ. ఎస్. వెల్లడి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 21.03.2022 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు న‌గ‌ర పాల‌క సంస్థ‌ ప్ర‌ధాన కార్యాలయము మరియు మూడు సర్కిల్ కార్యాలయములలో “స్పందన ” కార్యక్రమం నిర్వహించ బడుతుందని, ప్రజలు నేరుగా తమ యొక్క సమస్యల అర్జీలను అధికారులకు అందించవచ్చునని కమిషనర్ తెలిపారు.

Read More »

సీఎం జగన్‌ ను కలవనున్న ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన విద్యార్థుల బృందం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన విద్యార్థుల బృందం కృతజ్ఞతపూర్వకంగా సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నట్లు రాష్ట్ర రవాణా, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి మరియు టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్ నుంచి తరలివచ్చిన విద్యార్థుల బృందంలో జిల్లాకు ఒక్క విద్యార్థి చొప్పున ముఖ్యమంత్రిని కలవనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకు సచివాలయంలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రిని విద్యార్ధుల బృందం కలవనున్నది. …

Read More »