ఏప్రిల్ 3నుండి పద్యనాటక పోటీలు…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
కళల కాణాచి తెనాలి, వేద గంగోత్రి విజయవాడ సంయుక్త ఆథ్యర్యంలో ఏప్రిల్ 3నండి7వరకు ద్వితీయ జాతీయస్థాయి పద్యనాటక పోటీలు తెనాలి రామకృష్ణ కవికళాక్షేత్రంలో నిర్వహించనున్నామని కళల కాణాచి అద్యక్షుడు బుర్రా సాయిమాథవ్ తెలిపారు. స్థానిక CPI కార్యాలయమునందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ ఏప్రిల్ లో పౌరాణిక అక్టోబర్ లో సాంఘిక నాటక పోటీల నిర్వహణలో సాంప్రదాయంగా పౌరాణిక నాటక పోటీలు నిర్వహిస్తుందన్నారు. ఈ పర్యాయం తన తండ్రి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి జాతీయ పురస్కారమును ప్రముఖ రంగస్థల నటుడు రచయిత దర్శకుడు ప్రయేక్త లెజెండ్ తుర్లపాటి రాథాకృష్ణమూర్తికి ఇవ్వనున్నట్లు దీనితో పాటు 25వేలు నగదు ఙ్ఞాపిక ఇవ్వనున్నట్లు తెలిపారు. పిదప న్యాయనిర్ణేతలుగా ఉన్న T. V. S శాస్త్రి మాట్లాడుతూ 24 పౌరాణిక నాటకాలలో స్క్రూటినీ చేసి9 నాటకాలు ఎంపిక చేయడం మైందని అవి…
1. శ్రీకృష్ణ దేవరాయ, తిరుపతి
2. సీతా కళ్యాణం, కాకినాడ
3. యయాతి, మధిర
4. శ్రీ కృష్ణ కమల పాలిక, కర్నూలు
5. చాణక్య చంద్రగుప్త, ఖమ్మం
6. సింహ బల కీచక హైదరాబాద్
7. భీమార్జున గర్వభంగం ఒంగోలు,
8. రావణ, మిర్యాలగూడ
9. పల్నాటి యుద్ధం గుంటూరు
ప్రత్యేక ప్రదర్శన గా స్థానిక కళాకారులచే ఏ. ఆదినారాయణ  ఆధ్వర్యంలో “ప్రజాకవి వేమన” నాటకాలు ప్రదర్శింపబడుతాయని తెలియజేశారు. ప్రధాన కార్యదర్శి Sk. జానీ భాష మాట్లాడుతూ ప్రదర్శించిన ప్రతి నాటకానికి పారితోషికం 50000/- ఇవ్వటం జరుగుతుందని మరియు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా 1,00,000/- మరియు బంగారు వీణ, 75000/- మరియు రజిత వీణ, 50,000/- మరియు కాంస్య వీణ ఇవ్వడం జరుగుతుందని అంతేగాక వీటికి ప్రదర్శనకు ఇచ్చె 50వేలుంటాయని, వ్యక్తిగత బహుమతులకు నగదు ప్రోత్సాహాన్ని ఇవ్వబడుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డా.అయినాల మల్లెశ్వరరావు, G.కేశవరావు, Ch.సింగారావు, బండారు మోహనరావు ,శ్రీనివాసరాజు, భవానీ సౌజన్య వసంత యామిని ప్రభృతులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *