నేటి పత్రిక ప్రజావార్త : వేసవి కాలంలో సగ్గు జావ తాగితే చాలా మంచిది. ఎందుకంటే సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో అలసిన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. సగ్గు బియ్యంలోని పొటాషియం రక్త ప్రసరణను సాఫీగా చేసి గుండె మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా సాయపడుతుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. సగ్గు బియ్యంలోని క్యాల్షియం వల్ల ఎముకలకు బలం పెరుగుతుంది.
Read More »National
శ్రీ పాండురంగస్వామి(విఠల్ రుఖ్మిని) ఆలయం
నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పాండురంగస్వామి(విఠల్ రుఖ్మిని) ఆలయం, పండరీపురం, మహారాష్ట్ర. భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో దేని విశిష్టత దానిది. వీటిలో కొన్ని శైవక్షేత్రాలు, మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు. మన రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన తిరుమలగా మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ‘విఠోబా’ పేరుతో వెలసియున్నాడు. విఠోబా లేక వితోబా అనే పేరు పురాణాలలో కూడా ఉంది. మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా …
Read More »శ్రీ తుల్జాపూర్ భవానీ ఆలయం….
నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ తుల్జాపూర్ భవానీ ఆలయం, ఉస్మానాబాద్, మహారాష్ట్ర. తుల్జా భవానీ ఆలయం మహారాష్ట్రలో ముఖ్యమైనది మరియు అత్యంత గౌరవనీయమైన దేవత. ఇది మహారాష్ట్రలోని తుల్జాపూర్ జిల్లా ఉస్మానాబాద్ వద్ద ఉంది. ఇది మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల్లోని అనేక కుటుంబాలలో కుటుంబ దేవత (కులదేవత). ‘తుర్జా’ అని కూడా పిలువబడే తుల్జాభావని మహారాష్ట్రకు చెందిన దేవత మరియు భారతదేశానికి యాభై ఒక్క శక్తిపీఠాలలో ఒకటి. యాత్రికులు మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి తుల్జాపూర్ వస్తారు. తుల్జా భవానీ …
Read More »బ్రిటిషు వాళ్ళు..చంపిన కూడా స్వామివారి.. మొసలి (బబియా) తిరిగి..బ్రతికింది..!!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తున్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి మొసలి భక్తులలో భగవంతునిపై నమ్మకాన్ని పెంపొందిస్తోంది. కేరళలోని కాసరగోడ్ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలోని కొలనులో కేవలం స్వామి వారి ప్రసాదాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించే శాకాహార మొసలి ” బబియా ” నేటికి మనకు దర్శనమిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఎవరికీ హాని చేయని మొసలి స్వామి వారి ప్రసాదం తప్పా ఇంకేమి తినదు. నీళ్ళలోకి దిగి ఆ మొసలి నోటికి ప్రసాదాన్ని …
Read More »ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జాగ్రత్త…!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అవును ఇది ముమ్మాటిటికీ నిజం. మనం పనిచేసే ఛానల్ కవరేజ్ కోసం వాడుతున్న లోగో లు కరోనా ను మోసుకొస్తాయి అని చెప్పడంలో సందేహామే లేదు. ఇది యదార్థం కూడా. కానీ జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకొంటున్నారు. కానీ లోగో ఉపయోగించే తీరులో దానిని వినియోగించే జర్నలిస్ట్ కు, మాట్లాడే వారికి ప్రమాదమే. ఎందుకో చూద్దాం. వివిధ చానళ్లు లోగోలు ప్రతి రిపోర్టర్ కు ఇస్తారు. మేజర్ సెంటర్ లలో ప్రతి …
Read More »కోవిషీల్డ్ , కోవాక్సిన్ లలో ఏది ఉత్తమమైనది…
నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ వ్యాప్తంగా జనవరి 16, 2021న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మార్చి 4వ తేదీ వరకు దాదాపు 1.8 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇచ్చారు. మార్చి 1నుంచి ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది ఉత్తమమైనదన్న సందేహాలున్నపుడు ఈ విషయాలు గుర్తించి నిర్ణయం తీసుకోవచ్చు. …
Read More »నిరంతరం సబ్బుతో కడగాలా!?
నేటి పత్రిక ప్రజావార్త : “చేతుల్ని నిరంతరం సబ్బుతో కడుక్కోండి” అంటూ ఫోన్లో వస్తున్న “కరోనా” అనౌన్స్మెంట్ ఫాలో అయ్యి, పొద్దుగాలా సబ్బుతో కడుగుతూ ఉంటే, చేతులకున్న చర్మం హాండ్ గ్లౌజ్ లా ఊడి వచ్చేయొచ్చు. అయినా కూడా కరోనా సోకవచ్చు. Hand washing కరోనా నుండి ప్రొటెక్షన్ ఇవ్వడం నిజమే గానీ, ఎక్కువసార్లు కడుక్కోవడం వల్ల కాదు. సరైన పద్ధతిలో కడగడం వల్ల.. “ఎన్నిసార్లు కడిగాం” అనేది అస్సలు ముఖ్యం కాదు. ఎప్పుడెప్పుడు కడగాలి ? ఎలా కడగాలి ? ఎంత సేపు …
Read More »దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి సూపర్ స్టార్ కృష్ణ అర్హుడే…
నేటి పత్రిక ప్రజావార్త : దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ అర్హుడే అని చెప్పడానికి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అయన నటుడుగా, నిర్మాత, దర్శకుడిగా సాంకేతికపరంగా అందించిన ఎన్నో ప్రయోగాలే నిదర్శనం. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సేవలు అందించిన నటులు ఎందరో ఉన్నారు. వాళ్లలో తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. తన కెరీర్ లో సుమారు 350 సినిమాలలో హీరో గా నటించి పరిశ్రమలో తన సత్తా చాటుకున్నాడు. నిర్మాత, దర్శకుడిగా కూడా కృష్ణ …
Read More »విష్ణువు మూర్తి యొక్క అద్భుతమైన విగ్రహం
నేటి పత్రిక ప్రజావార్త : విష్ణువు మూర్తి యొక్క అద్భుతమైన విగ్రహం ఒకటి కర్ణాటకలో సక్లేషపూర్ అనే గ్రామంలో గ్రామస్తులు వేటి గురించో తవ్వుతూ బయటపడింది. అదృష్టవశాత్తూ తవ్వకాలలో ఎక్కడా దెబ్బ తగలకుండా విగ్రహం పూర్తి రూపంతో అద్భుతమైన స్థితిలో ఉంది. ఇది హొయసల కాలంలో చెక్కబడిన వాసుదేవుడు లా కనిపిస్తున్నాడు. చుట్టూ వున్న అర్చి వంటి దానిలో అందమైన సూక్ష్మ మైన దశావతారాలను కూడా చెక్కారు గమనించండి! అప్పటి విదేశీయుల దండయాత్రలు నుండి కాపాడుకుందికి బహుశా భూమి లోతుల్లో ఇసుక పారల మధ్య …
Read More »8 నెలల తర్వాత భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వరుడు
-గతేడాది జులై 19న చివరిసారి దర్శనం -రేపటి నుంచి పూర్తిస్థాయిలో పూజలు నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లాలో కృష్ణమ్మ ఒడిలో కొలువైన సంగమేశ్వరస్వామి 8 నెలల తర్వాత భక్తులకు నిన్న తొలిసారి దర్శనమిచ్చారు. గతేడాది జులై 19న ఆలయంలో కృష్ణానది నీటిలో ఒదిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించింది. శ్రీశైల జలాశయ నీటి మట్టం 839 అడుగులకు చేరుకోవడంతో సంగమేశ్వర ఆలయం ప్రహరీ, ముఖద్వారం, ఆలయంలోని దేవతామూర్తులు కనిపించాయి. వేపదారు శివలింగం మాత్రం అడుగు మేర నీటిలోనే …
Read More »