-డ్రైవర్లు మోసం చేస్తే వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం : సివిఎస్వో తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : నకిలీ దర్శన టికెట్లతో భక్తులను మోసం చేసిన ఆటోడ్రైవర్‌తోపాటు మరొకరిపై తిరుమల విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల టు టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం కాంప్లెక్స్‌లోని స్కానింగ్ సెంటర్‌లో విజిలెన్స్ వింగ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్నపాండిచ్చేరికి చెందిన సి.సుబ్రమణియన్, అతని స్నేహితులను కలిపి ముగ్గురిని విచారించారు. తిరుపతిలో ఆటో …
Read More »National
చిన్నారుల కోసం లైంగికనేరాల చట్టం-2012 (పోక్సో) అమలు…
కర్టెన్ రైజర్ స్టోరీ… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలో శుక్రవారం అధునాతన సౌకర్యాలతో, మహిళలకు, పిల్లలకు పూర్తి వసతులు కల్పిస్తూ నిర్మించిన పోక్సో కోర్టు, ఇతర కోర్టు భవన సముదాయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తి , జిల్లా పోర్టుపోలియో జడ్జి జస్టిస్ ఆసనుద్దీన్ అమానుల్లా, హైకోర్టు జడ్జిలు జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ బట్టు దేవానంద్ లు దృశ్య మాధ్యమం విధానంలో 21 వ తేదీ ఉదయం …
Read More »కరోనాపై యుద్ధంలో కీలక ఆయుధం మాస్క్…
-ఏ రకమైన ముసుగు మనల్ని పూర్తిగా రక్షిస్తుంది.. తెలుసుకోండి..! అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగడం మొదలైంది. మరోవైపు మాస్కులు ధరించాలని నిపుణులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఏ మాస్క్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది? ఏది ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది.. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో ఉంటుంది. వివిధ రకాల మాస్క్‌లు, వాటి ప్రభావం .. ఉపయోగం గురించి తెలుసుకుందాం. ఎన్ని రకాల మాస్క్‌లు ఉన్నాయి? స్థూలంగా చెప్పాలంటే, 3 రకాల మాస్క్‌లు ఉన్నాయి. …
Read More »నిన్నటి వరకు ఆ పండు పనికిరాదు.. ఆ ఒక్క నిర్ణయంతో ఇప్పుడు కాసులు కురిపిస్తోంది…
-వైఎస్సార్ చేయూత, ఆసరా లబ్ధిదారుల వినూత్న ఆలోచన -రైతుకు ఎకరాకు రూ.3 వేలు అదనపు ఆదాయం -రూ.18 లక్షలతో కుటీర పరిశ్రమ ఏర్పాటు -మూడున్నర నెలల్లో రూ.3.68లక్షల ఆదాయం -ఇప్పటిదాకా ఈ పండు వృధాగా చెత్తబుట్టల్లోకి.. ∙ ఇప్పుడు సోడా, జ్యూస్ తయారీకి శ్రీకారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిన్నా మొన్నటి వరకు ఆ పండు ఎందుకూ పనికిరానిది. గింజకున్న విలువ పండుకు లేదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలతో దానికీ మంచిరోజులొచ్చాయి. ఇప్పుడా రైతులకు అదనపు ఆదాయం …
Read More »కొన్ని వింతలు ఎంత చదివినా నమ్మశక్యం కావు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొన్ని వింతలు ఎంత చదివినా నమ్మశక్యం కావు, ఎంత శోధించినా కారణాలు అంతుచిక్కవు. అలాంటివి మనదేశంలో చాలానే కనిపిస్తాయి. తమిళనాడు కుంభకోణంలోని తిరునరైయూరు క్షేత్రంలో ఉన్న నాచ్చియార్ కోవెలనే తీసుకుందాం… ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారూ కొలువైనప్పటికీ ఇది శ్రీవారి వాహనమైన గరుత్మంతుడి ఆలయంగానే ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడికొచ్చే భక్తులకు వరాలు ఆయనే అనుగ్రహిస్తాడట. అంతేగాక, ఉత్సవమూర్తిగా ఉన్న గరుత్మంతుడి విగ్రహం ఊరేగింపు సమయంలో బరువు మారిపోతుంటుంది. స్వామివారు అంతః ప్రాకారంలో గరుడ వాహనం ఎక్కినప్పుడు …
Read More »పెద్దలను గౌరవించి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలనేదే సంక్రాంతి సందేశం – ఉపరాష్ట్రపతి
-అందుకే సంక్రాంతిని పెద్దల పండుగగా, పెద్ద పండుగగా చెబుతారు -కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ కారణంగానే భారతదేశానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు అన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు -సంస్కృతి, సంప్రదాయాలను పాటించడమే పండుగల వెనుక పరమార్ధం -అన్నదాతలు, పాడిపంటలు కేంద్రంగానే మనదేశంలో ఎక్కువశాతం పండగలు జరుపుకుంటాం -రైతును అన్నగా, అన్నదాతగా, పుడమితల్లిని అమ్మగా పిలిచే గొప్పసంస్కృతి భారతీయులది -సంక్రాంతి పండుగ సందర్భంగా నెల్లూరు స్వర్ణభారత్ ట్రస్ట్ పెద్దల ఆశ్రమంలో ఉన్న పెద్దలతో అంతర్జాలం ద్వారా మాట్లాడి, వారి యోగక్షేమాలను విచారించిన ఉపరాష్ట్రపతి -ఈ తరం …
Read More »ఓం నమః శివాయ నమః
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉజ్జయినిలో సంక్రాంతి పండుగ శనివారం స్వామివారి అలంకరణ.
Read More »ఓం అరుణాచలేశ్వరాయ నమః
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అరుణాచలంలో సంక్రాంతి పండుగ శనివారం స్వామివారి అలంకరణ మరియు ఊరేగింపు కార్యక్రమం.
Read More »వృధ్ధాచలం (విరుదాచలం)… కాశీకంటే పురాతనమైన పుణ్యక్షేత్రం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెలుతామని ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలుకుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిదిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం. వృద్దాచలాన్ని, వృద్ధకాశి …
Read More »“మోసగాళ్లకు మోసగాడు” చిత్రానికి 50 ఏళ్ళు పూర్తి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశంలోనే తొలి కౌబాయ్ సినిమాగా పేరు తెచ్చుకున్న “మోసగాళ్లకు మోసగాడు” చిత్రం హీరో సూపర్ స్టార్, డేరింగ్, డేషింగ్, నటశేఖర కృష్ణ జీవితాన్ని మలుపు తిప్పి… ఆర్ధికంగా నిలబెట్టి… ఇమేజ్ మార్చేసిన సినిమా. 2021 ఆగస్టు 27 కి ఆ సినిమా విడుదలై 50 ఏళ్ళు పూర్తి అయింది. అయినప్పటికీ సినిమా ఇంకా తాజా అనుభూతినిస్తుంది. అసలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండకపోతే పద్మాలయా సంస్థ నిలబడేది కాదు. ఆ సినిమానే …
Read More »
Prajavartha Online Telugu News