– కళాత్మక యోగా విభాగంలోనూ ఉన్నత శిఖరాలు అందుకోవాలి – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు – యోగా క్రీడా ప్రతిభావంతులకు కలెక్టర్ సత్కారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కళాత్మక యోగాలో జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు యువ యోగా క్రీడాకారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు సూచించారు. 2024, మార్చి 19-23 వరకు పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీలో యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. 48వ సీనియర్ నేషనల్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ (2023-24)ను నిర్వహించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో అమరావతి యోగా అండ్ ఏరోబికె్ …
Read More »Daily Archives: May 1, 2024
అత్యంత పారదర్శకంగా ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్
– ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విజయవంతంగా ప్రక్రియ – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అత్యంత పారదర్శకంగా ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జనరల్ అబ్జర్వర్లు మంజూ రాజ్‌పాల్, నరీందర్‌సింగ్ బాలి సమక్షంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆధ్వర్యంలో ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. రిటర్నింగ్ అధికారులతో …
Read More »సాయిబాబా సేవలు అభినందనీయం
– విలక్షణమైన పనితీరుతో అధికారులను మెప్పించారు – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాచార, పౌర సంబంధాల శాఖలో ప్రచార సహాయకులు, ఆడియో విజువల్ సూపర్‌వైజర్‌గా 33 ఏళ్ల పాటు సేవలందించిన ఆగం సాయిబాబా సేవలు అభినందనీయమని.. విలక్షణమైన పనితీరుతో ఆయన అధికారులను మెప్పించారని కలెక్టర్ ఎస్.డిల్లీరావు పేర్కొన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఆడియో విజువల్ సూపర్‌వైజర్ (ఏవీఎస్)గా పనిచేసి మంగళవారం పదవీ విరమణ చేసిన ఆగం సాయిబాబాను బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ …
Read More »ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు నరేందర్ సింగ్ బాలి బుధవారం మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ పరిధిలోని గొల్లపూడి, నల్లకుంట, జక్కంపూడి, వైయస్సార్ కాలనీ కొత్తూరు తాడేపల్లి గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలలో ఈ నెల13 వ తేదీన పోలింగ్ జరగనున్న దృష్ట్యా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో తగినంత వెలుతురు, త్రాగునీరు, విద్యుత్,మరుగుదొడ్లు ,అవసరమైన చోట షామియానా వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొండి….. ఓటు …
Read More »జిల్లాలో పోలీస్ అబ్జర్వర్ సుడిగాలి పర్యటన….
– చెక్ పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలి. – పోలీస్ పరిశీలకులు ప్రీతీందర్ సింగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉభయ రాష్ట్రాల సరిహద్దులోని తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తిరువూరు ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్, మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్స్ మిల్లి చెక్ పోస్ట్ లను బుధవారం అబ్జర్వర్ ప్రీతిందర్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈనెల 13 వ తేదీన పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో డబ్బు, మద్యం అక్రమ రవాణ జరుగకుండా పోలీస్ …
Read More »ఈవీఎంల ర్యాండమైజేషన్…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం మధ్యాహ్నం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నగరంలోని కలెక్టరేట్లో గల వారి చాంబర్లో ఈవీఎంల ర్యాండమైజేషన్ ఎన్నికల పరిశీలకులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి ర్యాండమైజేషన్ ఇదివరకే పూర్తి చేసి జిల్లా ఎన్నికల యంత్రాంగం సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాలకు వాటిని తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈవీఎంల రెండవ రాండమైజేషన్ ప్రక్రియలో భాగంగా తొలుత మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 7 …
Read More »వయోవృద్ధులు, దివ్యాంగులకు హోం ఓటింగ్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 2 వ తేదీ నుండి జిల్లాలోని వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసుకునే (హోం ఓటింగ్) సౌకర్యం కల్పించేందు కోసం జిల్లా వ్యాప్తంగా 35 బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 85 సంవత్సరాలు పైబడి ఉన్న వయోవృద్ధులు, 40 శాతం పైబడి వికలత్వం ఉన్న దివ్యాంగులకు వారి ఇంటి వద్దనే ఓటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. …
Read More »ఎన్నికల శిక్షణ కార్యక్రమం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించడంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర గణనీయమైనదని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సాధారణ ఎన్నికలు సందర్భంగా సూక్ష్మ పరిశీలకులకు బుధవారం స్థానిక జెడ్పి కన్వెన్షన్ హాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా సజావుగా నిర్వహించేందుకు, ఎన్నికల నిర్వహణ తీరు పరిశీలించేందుకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సంఘం వెబ్ కాస్టింగ్, …
Read More »మానిఫెస్టో లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పించిన నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు… : డూండి రాకేష్
చీరాల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీయే కూటమి మానిఫెస్టో లో సైతం ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ఆలోచించి తగు ప్రాధాన్యత కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ని బుధవారం చీరాల లోని ప్రజాగళం కార్యక్రమంలో తెలుగు వాణిజ్య విభాగం, రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ కలిసి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ప్రతిమను ఇచ్చి ధన్యవాదాలు తెలియజేశారు.
Read More »వైఎస్ఆర్సిపి లో 30 కుటుంబాలు చేరికలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 64 డివిజన్ లో భారీగా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సిపి లో 30 కుటుంబాలు చేరికలు జరిగాయి. బుధవారం ఆర్కే మరియు భక్తుల శేఖర్ ఆధ్వర్యంలో వైయస్సార్సీపీలో ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనపై ప్రజానీకం పూర్తి విశ్వాసంతో ఉన్నారని… స్వచ్ఛమైన మనసుతో ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ను కులమత వర్గాల కతీతంగా ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని తెలియజేశారు. వైసీపీ అభ్యర్థులందరూ కచ్చితంగా మంచి మెజార్టీలతో …
Read More »