Breaking News

యోగాస‌నాల్లో జిల్లాకు అంత‌ర్జాతీయ గుర్తింపు తేవాలి

– క‌ళాత్మ‌క యోగా విభాగంలోనూ ఉన్న‌త శిఖ‌రాలు అందుకోవాలి
– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు
– యోగా క్రీడా ప్ర‌తిభావంతులకు క‌లెక్ట‌ర్ స‌త్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క‌ళాత్మ‌క యోగాలో జిల్లాకు అంత‌ర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు యువ యోగా క్రీడాకారులు కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు సూచించారు.
2024, మార్చి 19-23 వ‌ర‌కు ప‌శ్చిమ‌బెంగాల్‌లోని హుగ్లీలో యోగా ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా.. 48వ సీనియ‌ర్ నేష‌న‌ల్ యోగా స్పోర్ట్స్ ఛాంపియ‌న్‌షిప్ (2023-24)ను నిర్వ‌హించింది. ఈ ఛాంపియ‌న్‌షిప్‌లో అమరావతి యోగా అండ్ ఏరోబికె్ అసోసియేషన్ ద్వారా పాల్గొని, విశేష ప్ర‌తిభ‌చూపి ఆర్టిస్టిక్ పెయిర్ యోగా సీనియ‌ర్ కేట‌గిరీలో 6వ స్థానం కేవ‌సం చేసుకున్న పి.షాలెమ్ రాజు, ఎల్ శ్రీకృష్ణలు ఆగ‌స్టులో సింగ‌పూర్‌లో జ‌రిగే ఇంట‌ర్నేష‌న‌ల్ యోగా స్పోర్ట్స్ ఛాంపియ‌న్‌షిప్‌లో పాల్గొనేందుకు అర్హ‌త సాధించారు. వీరిని బుధ‌వారం క‌లెక్ట‌ర్ డిల్లీరావు క‌లెక్ట‌రేట్‌లో ఘ‌నంగా స‌త్క‌రించి, అభినంద‌న‌లు తెలిపారు. ఇలాంటి మ‌రెన్నో విజ‌యాలు అందుకొని యోగా స్పోర్ట్స్‌లో ఉన్న‌త శిఖ‌రాల‌ను అందుకోవాల‌ని.. జిల్లాకు అంత‌ర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కృషిచేయాల‌ని సూచించారు. ప్ర‌తిభావంతుల‌ను గుర్తించి యోగాలో ఆణిముత్యాలుగా తీర్చిదిద్ద‌డంలో విశేష కృషిచేస్తున్న అమ‌రావ‌తి యోగా అండ్ ఏరోబిక్ అసోసియేష‌న్‌కు మరియు డి రవి కిరణ్ పి.బి సిద్ధార్థ కాలేజీ యోగ గురువు కు ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలియ‌జేశారు. కార్య‌క్ర‌మంలో ఏపీ యోగాస‌న స్పోర్ట్స్ అసోసియేష‌న్ జాయింట్ సెక్ర‌ట‌రీ, ఉమ్మ‌డి కృష్ణా జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ ఎల్‌.ముర‌ళీకృష్ణ‌, ఎన్‌టీఆర్ జిల్లా యోగాస‌న స్పోర్ట్స్ అసోసియేష‌న్ జాయింట్ సెక్ర‌ట‌రీ ఎల్‌.శాంతి, ఆర్టిస్టిక్ యోగా జాతీయ అవార్డీ జి.విజ‌య గౌరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *