విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు నరేందర్ సింగ్ బాలి బుధవారం మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ పరిధిలోని గొల్లపూడి, నల్లకుంట, జక్కంపూడి, వైయస్సార్ కాలనీ కొత్తూరు తాడేపల్లి గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలలో ఈ నెల13 వ తేదీన పోలింగ్ జరగనున్న దృష్ట్యా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో తగినంత వెలుతురు, త్రాగునీరు, విద్యుత్,మరుగుదొడ్లు ,అవసరమైన చోట షామియానా వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.
ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొండి….. ఓటు యొక్క ప్రాముఖ్యత, వోటర్ భాద్యత, మన ఓటుహక్కును ఎలా వినియోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. ఈనెల 13న జరిగే పోలింగ్ పండుగలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల పరిశీలకులు నరేంద్ర సింగ్ బాలి కోరారు.
విటిపిఎస్ ను సందర్శించిన పరిశీలకులు…
ఇబ్రహీంపట్నం విటిపిఎస్ ను సందర్శించి ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఉద్యోగస్తులు కుటుంబ సభ్యులు ఈనెల 13న ఓటువేసి నూరు శాతం ఓటింగ్ నమోదయ్యేలా చూడాలని అన్నారు.
Prajavartha Online Telugu News