Breaking News

ఎన్నికల శిక్షణ కార్యక్రమం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించడంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర గణనీయమైనదని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సాధారణ ఎన్నికలు సందర్భంగా సూక్ష్మ పరిశీలకులకు బుధవారం స్థానిక జెడ్పి కన్వెన్షన్ హాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా సజావుగా నిర్వహించేందుకు, ఎన్నికల నిర్వహణ తీరు పరిశీలించేందుకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సంఘం వెబ్ కాస్టింగ్, నిరంతర వీడియోగ్రఫీ ఏర్పాట్లతో పాటు సూక్ష్మ పరిశీలకులను నియమిస్తుందన్నారు. ఇందులో భాగంగా ఈరోజు సూక్ష్మ పరిశీలకుల విధులు బాధ్యతలు గురించి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మీ విధులు బాధ్యతలకు సంబంధించి 18 పాయింట్లు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.

మచిలీపట్నం లోక్ సభ స్థానానికి మరియు పెడన మచిలీపట్నం అవనిగడ్డ శాసనసభ స్థానాలకు సాధారణ పరిశీలకులు జాన్ కింగ్స్ లే మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో మీ విధులు బాధ్యతలు పట్ల అవగాహన కలిగి ఉండాలని, సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. పోలింగ్ నిర్వహణ తీరు పరిశీలించి, ఈసీ నిబంధనల మేరకు మీరు పరిశీలించిన విషయాలపై సాధారణ పరిశీలకులకు నివేదికలు సమర్పించాల్సి ఉంటుందన్నారు.

గన్నవరం, గుడివాడ, పామర్రు, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు నరహరి సింగ్ బంగర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల సంఘం యొక్క కళ్ళు చెవులు వంటి వారని అన్నారు. మీ పరిధిలో గల పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణ తీరు పరిశీలన గావించాలని, ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేందుకు కృషి చేయాలన్నారు. డిఆర్ఓ కె చంద్రశేఖర రావు మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లకు నియోజకవర్గాల వారి విధుల కేటాయింపు జరిగిందన్నారు నియోజకవర్గ స్థాయిలో ఈనెల 8వ తేదీన శిక్షణ ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

తొలుత కలెక్టరేట్ సూపర్నెంట్ తేజేశ్వరరావు మైక్రో అబ్జర్వర్ల విధులు బాధ్యతలు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ కార్యక్రమంలో మ్యాన్ పవర్ నోడల్ అధికారి, జడ్పీ సీఈవో ఆనంద్ కుమార్, శిక్షణ నోడల్ అధికారి బి.మురళీ కిషోర్, ఎల్. డి. ఎం. జయవర్ధన్, కమ్యూనికేషన్ నోడల్ అధికారి ఎస్ఎస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *