Breaking News

వైఎస్ఆర్సిపి లో 30 కుటుంబాలు చేరికలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
64 డివిజన్ లో భారీగా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సిపి లో 30 కుటుంబాలు చేరికలు జరిగాయి. బుధవారం ఆర్కే మరియు భక్తుల శేఖర్ ఆధ్వర్యంలో వైయస్సార్సీపీలో ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనపై ప్రజానీకం పూర్తి విశ్వాసంతో ఉన్నారని… స్వచ్ఛమైన మనసుతో ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ను కులమత వర్గాల కతీతంగా ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని తెలియజేశారు. వైసీపీ అభ్యర్థులందరూ కచ్చితంగా మంచి మెజార్టీలతో విజయం సాధించబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎం శివమణి, కే ప్రసాద్, ఎం విజయ్, కే రవి కిరణ్, ఆర్ బాబురావు, ఆర్ రామకృష్ణ,  బి శర్వాన్, ఎం మధు సేన,  పి ఎలీషా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *