Breaking News

ఈవిఎం మేనేజ్మేంట్ సిస్టమ్ ద్వారా ర్యాండమైజేషన్ ప్రక్రియ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలకు ర్యాండమైజేషన్ ద్వారా ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈవిఎం ల కేటాయింపును బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఎస్.పి.కార్తీక, పశ్చిమ నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్ధుల సమక్షంలో ఈవిఎంల ర్యాండమైజేషన్ ని రిటర్నింగ్ అధికారి, నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ కె. రాజ్యలక్ష్మి నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి ఛాంబర్ నందు చేపట్టారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 291 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల బ్యాలెట్ యూనిట్ల కేటాయింపుకు ఈవిఎం మేనేజ్మేంట్ సిస్టమ్ ద్వారా ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్ధుల సమక్షంలో జరిగిన ర్యాండమైజేషన్ లిస్టు మేరకు మే 13 జరిగే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలో ఈవిఎంలను వినియోగిస్తామని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్ధులకు గుర్తింపు కార్డ్ లు అందిస్తామని తెలిపారు. హోం ఓటింగ్ కి సంబందించి రూట్ మ్యాప్ ని పోటీలో ఉన్న అభ్యర్ధులకు అందిస్తామని, హోం ఓటింగ్ పరిశీలనకు అభ్యర్ధులు లేదా వారి ఏజంట్లు ఉండవచ్చని, అందుకు అవసరమైన వివరాలు ఇస్తే గుర్తింపు కార్డ్ లు అందిస్తామని తెలిపారు. అభ్యర్ధులు, అధికారులతో కలిసి వాట్స్ అప్ గ్రూప్ ఏర్పాటు చేశామని, గ్రూప్ లో ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం పోస్ట్ చేస్తామని వివరించారు.
కార్యక్రమంలో ఏఆర్ఓలు సి.హెచ్ శ్రీనివాసరావు, సీనారెడ్డి, సూపరిండెంట్ లు పద్మ,వెంకట రామయ్య,అభ్యర్ధులు,ఎలక్షన్ ఏజంట్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *