-కౌలు రైతులకు వ్యవసాయాధికారులచే గుర్తింపు కార్డులు జారీ- రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కౌలు రైతులకు పంట రుణాలు అందించడంలో మరింత మేలు జరిగేలా ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లో గురువారం బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా …
Read More »Daily Archives: September 26, 2024
ఉన్నత స్థాయి కమిటీ సమీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో NH ప్రాజెక్టుల భూసేకరణ మరియు అటవీ క్లియరెన్స్ లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు అన్ని NH ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలికవసతుల శాఖ బీ.సీ జనార్ధన్ రెడ్డి సూచించారు. విజయవాడలోని రోడ్లు మరియు భవనాల శాఖ ఈఎన్ సీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ పలు అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో ప్రస్తుతం జాతీయ రహదారులకు సంబంధించి …
Read More »కేంద్ర ప్రాయోజిత పధకాల అమలుపై సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పధకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,హోం,నైపుణ్య అభివృద్ధి,సాంఘిక,బిసి,గిరిజన మహిళా శిశు సంక్షేమం విభిన్న ప్రతిభా వంతుల శాఖలతో పాటు,గృహ నిర్మాణ,వ్యవసాయ,వైద్య ఆరోగ్య,మత్స్య శాఖలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పధకాల అమలు తీరును,ఆయా పధకాల ప్రగతిని సిఎస్ సమీక్షించారు.ముందుగా పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు …
Read More »కోరుకొండ సైనిక స్కూల్ విద్యార్ధులతో ముచ్చటించిన పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కోరుకొండలో రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న సైనిక్ స్కూల్ ను గురువారం నేను సందర్శించాను. పచ్చటి పరిసరాల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుతీరిన ఈ పాఠశాలలో విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా బోధన అందించడం సంతోషకరం. కెప్టెన్ ఎస్ ఎస్ శాస్త్రి తో కలిసి పాఠశాలలోని అన్ని విభాగాలను సందర్శించాను. విద్యార్థులతో ముచ్చటించటం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడి విద్యార్థుల్లో ప్రస్ఫుటమవుతున్న దేశభక్తి, వారిలో కనిపిస్తున్న క్రమశిక్షణ నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. …
Read More »న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-ప్రపంచ బ్యాంకు సహజ వనరుల పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్‌స్టర్ తో సమావేశమైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -వరదలు కరువు నివారణ చర్యలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్న మైక్ వెబ్‌స్టర్ -చిత్తూరు జిల్లాలో తాము చేపట్టిన కార్యక్రమాలకు చంద్రబాబు ప్రభుత్వ ప్రోత్సాహం, సహకారాన్ని గుర్తుచేసుకున్న మైక్ వెబ్‌స్టర్ -సౌరశక్తి రంగంలో నూతన ఆవిష్కరణలపై జోనాథన్ బెర్మాన్, మీరా షాతో చర్చించి మంత్రి శ్రీనివాస్ న్యూయార్క్/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ బ్యాంకు 2030 నీటి వనరుల ప్రోగ్రామ్ …
Read More »బ్రహ్మోత్సవముల సందర్బంగా కాణిపాకం వినాయక స్వామివారికి దుర్గ గుడి నుండి పట్టు వస్త్రాలు సమర్పణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దుర్గ గుడి అధికారులు ఏఈఓ బి. వెంకట్ రెడ్డి మరియు వైదిక కమిటీ సభ్యులు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామీ వారి దేవస్థానం చేరుకోగా కాణిపాకం ఆలయ ఈవో గురుప్రసాద్ ఆలయ మర్యాదలతో మేళ తాళాల నడుమ స్వాగతం గురువారం పలికారు. అనంతరం వీరు వినాయక స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం దుర్గ గుడి సిబ్బందికి కాణిపాకం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా , ఈవో గురుప్రసాద్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం …
Read More »డిజిపిని కలసిన… బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి డిజిపి ద్వారకాతిరుమల రావు తో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో బిజెపి ప్రతినిధి బృందం భేటీ అయ్యారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్గాలు మద్య జరిగిన సంఘటన లు భవిష్యత్తులో ఆయా వర్గాల మధ్య వైషమ్యాలు చెలరేగకుండా శాంతి కమిటీ లు ఏర్పాటు చేసి శాంతి భద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. డిజిపి ని కలసిన వారి లో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్, బిజెపి మీడియా …
Read More »ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఆహ్వాన పత్రిక
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను టిటిడి ఆలయ అధికారులు అందజేశారు. మంగళగిరిలోని డిప్యూటీ సిఎం క్యాంపు కార్యాలయంలో నేడు కలసిన టిటిడి అధికారులు ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందించారు. అనంతరం తిరుమల ఆలయ అర్చకులు పవన్ కు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందచేశారు.
Read More »జనసేన పార్టీలో చేరిన వైసీపీ కీలక నేతలు
-మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య చేరిక -విజయనగరం జిల్లా నుంచి వైసీపీ నేతలు అవనపు విక్రమ్ దంపతులు -పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీలో కీలకంగా పని చేసిన పలువురు నేతలు గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ప్రకాశం జిల్లా వైసీపీ నేత, మాజీ …
Read More »“గవర్నెన్స్ నౌ 9th పి ఎస్ యు ఐటీ అవార్డ్స్”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2024 సంవత్సరమునకుగాను “గవర్నెన్స్ నౌ 9th పి ఎస్ యు ఐటీ అవార్డ్స్” అవార్డుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంపిక అయినదని తెలియచేయుటకు సంతోషించుచున్నాము. “యాప్” ద్వారా నగదు రహిత లావాదేవీలు మరియు కాగిత రహిత టికెట్ల జారీ సౌలభ్యాన్ని ప్రవేశ పెట్టుట, In Bus లో డిజిటల్ టికెట్లు జారీ చేయుట, సంస్థ అన్ని బస్సులలో ట్రాకింగ్ సిస్టం ను ఏర్పాటు చేయుట ద్వారా సంస్థ ఈ అవార్డును అందుకొనుచున్నది. ఈరోజు, ఢిల్లీ …
Read More »
Prajavartha Online Telugu News