-పంట నష్టం అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు వేగవంతం చేయండి -డ్రెయిన్ కాలువలు క్లియర్ చేసి నీటి నిల్వలు మళ్లించండి -పశువులు మృత్యువాత పడకుండా అధికారులు, సిబ్బంది మందులతో అందుబాటులో ఉండాలి -వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల కాల్ సెంటర్లు కొనసాగించండి -పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది సెలవులు పెట్టకండి -రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడే పంట …
Read More »Monthly Archives: September 2024
రైతులకు పూర్తి స్థాయి భరోసా కల్పించండి
-బుడితి రాజశేఖర్ ఐఏఎస్ , ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ( వ్య & స) వ్యవసాయ అధికారులు జిల్లా పాలన యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రైతులకు క్షేత్ర స్థాయిలో అందుబాటులో వుండండి . -S.డిల్లీ రావు , ఐఏఎస్,వ్యవసాయ సంచాలకులు ,ఆంధ్రప్రదేశ్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ది. 01/09/2024 ఆదివారం న రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు , ఐఏఎస్ వారు ,రాష్ట్రములోని అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు మరియు అనుబంధ శాఖల అధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు .తుఫాను రాష్ట్ర తీరం …
Read More »ఏలూరు జిల్లాలో వర్ష పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా
-ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రికి ముఖ్యమంత్రి ఆదేశం -ఏలూరు జిల్లాలో వర్ష పరిస్థితిని మంత్రి పార్థసారథి ని టెలిఫోన్ ద్వారా ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు -జిల్లా యంత్రాంగాన్ని అపప్రమత్తం చేసి ఎటువంటి నష్టం సంభవించకుండా పటిష్టచర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రికి తెలియజేసిన మంత్రి పార్థసారథి నూజివీడు/ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్త్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార …
Read More »మంత్రులు అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడిన 294 గ్రామలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరిలించామని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యలయంలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఆదివారం ప్రస్తుత వరద పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో …
Read More »ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలి…
నూజివీడు/ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు పెద్దచెరువుకు వచ్చిన వరద కారణంగా నీట మునిగిన నూజివీడు లోని పలు ప్రాంతాలను మంత్రి కొలుసు పార్థసారథి అధికారులతో కలిసి ఆదివారం ఎన్, టి, ఆర్, కాలనీ, గాంధీనగర్ నగర పురవీధుల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ పెద్దచెరువుకు గండి …
Read More »గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్ఐ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం
-బందోబస్తు విధుల కోసం వచ్చిన ఎస్ఐ శిరీషను వెనక్కు పంపిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమేరాల అంశంపై విచారణ జరుగుతోంది. ఈ విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో మాట్లాడి విచారణపై సమీక్ష చేస్తున్నారు. ఈ ఘటనపై ఇన్ వెస్టిగేషన్ ఆఫీసర్ గా సిఐ రమణమ్మను ఎస్పీ నియమించారు. ఆమె నేతృత్వంలో విచారణ జరుగుతుండగా….బందోబస్తు కోసం పలు ప్రాంతాల నుంచి మహిళా పోలీసు అధికారులను, …
Read More »ముంపు బాధితులకు పూర్తి భరోసా
– సహాయ చర్యలకు ప్రత్యేక అధికారుల నియామకం. – లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలింపు. – పునరావాస కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు – గౌరవ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్నాం. – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షం తగ్గుముఖం పట్టినా.. ముంపు ముంచెత్తడంతో యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టామని.. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో …
Read More »ప్రశాంత వాతావరణంలో ముగిసిన యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడెమీ & నావల్ అకాడెమీ మరియు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2024 పరీక్షలు
– జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఆదివారం జరిగిన యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడెమీ & నావల్ అకాడెమీ మరియు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2024 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారము ఉదయం 10 నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం 2.00 నుండి 4:30 గంటల వరకు రెండు సెషన్ల లో యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడెమీ & నావల్ అకాడెమీ పరీక్ష నిర్వహణ జరిగిందనీ, తిరుపతిలో …
Read More »సెప్టెంబర్ 2వ తేది (నేడు) జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 2వ తేది (నేడు) సోమవారం తిరుపతి జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కళాశాలల …
Read More »5 కె రెడ్ రన్ మారికాంక్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వైద్యఆరోగ్య శాఖ , జిల్లా ఎయిడ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నియంత్రణలో భాగంగా అవగాహన కల్పిస్తూ 5 కె రెడ్ రన్ మారికాంక్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టి. బి తిరుపతి అధికారి డాక్టర్ ఓ. శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ 5 కె రెడ్ రన్ మారథాన్ ఉదయం 6 గంటల నుండి భారతీయ విద్యాభవన్ అలిపిరిరోడ్ నుంచి టాటా కాన్సర్ ఆసుపత్రి వరకు మరియు …
Read More »
Prajavartha Online Telugu News