Breaking News

Monthly Archives: September 2024

వర్షాలు తగ్గిన తదుపరి పూర్తి స్దాయిలో ఇసుక సరఫరా

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా -రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక 15,03,603 మెట్రిక్ టన్నులు -భారీ వర్షాల కారణంగా ఇసుక సరఫరాలో అంతరాయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదనీటి కారణంగా ఇసుక సరఫరాలో నెలకొన్న అంతరాయాన్ని అతి త్వరలో పునరుద్దరిస్తామని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి, ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వివిధ రీచ్ ల నుండి సరఫరా నిలిచిపోయిందని, …

Read More »

బాదితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు వలన గుంటూరు నగరపాలక సంస్థ తూర్పునియోజకవర్గం పరిధిలో ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాలను ఆదివారం కేంద్ర గ్రామీణభివృద్ధి , కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహ్మద్ నసీర్ అహ్మద్ తో కలసి పరిశీలించారు. పాతగుంటూరులోని ఎల్బీ నగర్, ప్రగతి నగర్, సుద్దపల్లి డొంక, జూన్ షాహెద్ ప్రాంతాలలో పర్యటించారు. ప్రగతినగర్ , జూన్ షాహెద్ ప్రాంతాల్లో …

Read More »

గుంటూరు నగరంలో లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించడానికి చర్యలు…

-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు నిలిచిన లోతట్టు ప్రాంతాల్లో నీటిని తొలగించడానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. ఆదివారం బిఆర్ స్టేడియం, శ్రామిక నగర్, ముగ్డుం నగర్, బాలాజీ నగర్ మొండి గేటు తదితర ప్రాంతాల్లో పర్యటించి, ఆయా ప్రాంతాల్లో నిలిచిన వర్షం నీటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

గుంటూరు నగరంలో మురుగుపారుదలకు అడ్డుగా ఉన్న డ్రైన్ల పై ఆక్రమణల తొలగింపు…

-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్ల పై ఆక్రమణలు ఇష్టానుసారం చేస్తున్నారని ఫలితంగా ప్రస్తుత వర్షాలకు డ్రైన్లు బ్లాక్ అయి వర్షం నీరు ఇళ్లల్లోకి, లోతట్టు ప్రాంతాలకు చేరీ స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కల్గిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఆదివారం జిటి రోడ్, శ్రీనివాసరావు తోట, పాత గుంటూరు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, డ్రైన్ల ఆక్రమణల పై అధికారులపై ఆగ్రహం …

Read More »

లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు..

-రేపు పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు సెలవు -పరిస్థితుల దృష్ట్యా మీకోసం కార్యక్రమం రద్దు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అధిక వర్షాలు, వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామని, వరద ఉధృతని ఎదుర్కొనేందుకు, ప్రజలను రక్షించేందుకు జిల్లా యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ లో మీడియా సమావేశం నిర్వహించి అధిక వర్షాలు, వరదలపై తాజా పరిస్థితులను …

Read More »

జాబ్ మేళా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.03.09.2024 మంగళవారం నాడు “అవనిగడ్డ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల” నందు నిర్వహించబోయే “జాబ్ మేళాను”, గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరియు నెలకొని ఉన్న వరదల కారణంగా అవనిగడ్డ లో నిర్వహించబోయే జాబ్ మేళాను వాయిదా …

Read More »

అధిక వర్షాలు, కృష్ణా నది వరద ఉధృతి పర్యవేక్షించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

-కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08672-252572 మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో అధిక వర్షాలు, కృష్ణానది వరద ఉధృతి ఎదుర్కోవడానికి జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08672-252572. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కంట్రోల్ రూమ్ లో రెండు, మూడు షిఫ్ట్ లలో 24 గంటలు అందుబాటులో ఉంటూ వారి వారి శాఖల ద్వారా చేపట్టిన …

Read More »

లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

-ఒక్కో లంక గ్రామానికి ఒక్కొక్క బృందాన్ని ఏర్పాటు చేశాం -జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వరద ఉధృతిని ఎదుర్కోవడానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా కృష్ణా జిల్లాలో నది వెంబడి గ్రామాల, లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో …

Read More »

భోజనము మంచినీరు వంటి సదుపాయాలు కల్పించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మోపిదేవి మండలంలోని లోతట్టు ప్రాంతాలైన బొబ్బర్లంక, కొత్తపాలెం గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడి పునరావాస కేంద్రంలో వారికి భోజనము మంచినీరు వంటి సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తహసిల్దార్ శ్రీవిద్యను ఆదేశించారు ఆదివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పలువురు అధికారులతో సెల్ఫోన్లో మాట్లాడుతూ వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేశారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం రాను రాను పెరిగే …

Read More »

తీరం దాటిన వాయుగుండం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అర్ధరాత్రి 12.30 మరియు 0230 గం మధ్య ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటిన వాయుగుండం. ఇవాళ చాలా చోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు …

Read More »