Breaking News

Monthly Archives: November 2024

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్ర, సంగీతం, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేలా డిసెంబర్ 6,7,8 తేదీల్లో విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం నిర్వహణ

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న “కృష్ణవేణి సంగీత నీరాజన” కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్,కేంద్ర పర్యాటక శాఖ అధికారులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్ర, సంగీతం, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేలా డిసెంబర్ 6,7,8 తేదీల్లో విజయవాడ లో కృష్ణవేణి సంగీత నీరాజనం …

Read More »

ఉపాధి పథకంలో గ్రామాభివృద్ధి మెండుగా జరగాలి

-కొత్త పనులను చేర్చాలి… గ్రామాల్లో అంతర్గత పనులకు అనుమతివ్వాలి -కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ హామీ పథకంలో భాగంగా పనులు చేస్తున్న సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణం, అంగన్వాడీ, వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులు, మహిళా స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణాలకు సంబంధించి అంచనా వ్యయం నిధులను పెంచాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ …

Read More »

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి ఏఐఐబీ రుణంలో వెసులుబాట్లుకు సహకరించండి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీలో గౌరవనీయులైన భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి ఏఐఐబీ రుణంలో వెసులుబాట్లు కోరారు. * ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ (ఏపీఆర్‌ఆర్‌పీ) కోసం ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) నుంచి తీసుకొన్న రుణానికి సంబంధించి ప్రాజెక్టును 31 డిసెంబర్ 2026 వరకు పొడిగింపు చేయాలని విజ్ఞప్తి చేశారు. …

Read More »

పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి అవసరం

-నాలుగు ముఖ్యమైన రైళ్లకు పిఠాపురంలో హాల్ట్ మంజూరు చేయండి -కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సామర్లకోట – ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవసరం ఉందని, సత్వరమే ఈ ఆర్వోబీని మంజూరు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో అశ్విని …

Read More »

రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించేందుకు సహకరించండి

-జల్ జీవన్ మిషన్ కార్యక్రమ స్ఫూర్తిని విజయవంతంగా అమలు చేస్తాము -కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ తో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జల జీవన్‌ మిషన్‌ (జె.జె.ఎం.) యొక్క నిజమైన స్ఫూర్తిని సాధించాలంటే… బోరు బావులపై ఎక్కువగా ఆధారపడకుండా.. దీర్ఘకాలిక, నిలకడతో ఉన్న వనరుల నుంచి నీటిని సేకరించడం చాలా కీలకం. ఆ దిశగా ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ …

Read More »

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్

-శ్రీశైలం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి అనిత -కుటుంబసమేతంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకున్న హోంమంత్రి -ఎక్స్ అకౌంట్ ద్వారా రాజ్యాంగ వజ్రోత్సవ శుభాకాంక్షలు వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రవాయుగుండంగా మారనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న రెండు రోజుల్లో ఉత్తరాంధ్రకు భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమ, కోస్త్రాంధ్ర సహా వర్షం పడే అవకాశమున్న …

Read More »

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటక రంగానికి ఊతమివ్వండి

-రాష్ట్రంలో పర్యటక అభివృద్ధికి కేంద్ర సహకారం అత్యవసరం -జాతీయ పర్యటక విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయగలరు -ప్రసాద్ స్కీమ్ ద్వారా అరసవల్లి, మంగళగిరి క్షేత్రాలు అభివృద్ధికి సహకరించగలరు -ఢిల్లీలో కేంద్ర పర్యటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసి రాష్ట్ర పర్యటక ప్రాజెక్టులపై చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి మకుటాయమానంగా నిలిచే పర్యటక ప్రాజెక్టులకు కేంద్రం తగిన విధంగా సహకరించి, వాటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ …

Read More »

రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దాం

-విద్యుత్ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స‌చివాల‌యం, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగం ఇచ్చిన హ‌క్కుల‌తోనే అంద‌రికీ స‌మ‌న్యాయం జ‌రుగుతోంద‌ని, అందుకే రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. రాజ్యాంగ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్ర‌త్యేక అతిధిగా ఏర్పాట‌యిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. అనంతరం తన చాంబర్ లో జరిగిన రాజ్యాంగ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో భాగంగా సాంఘీక, సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల‌వీరాంజ‌నేయులుతో …

Read More »

ఆర్డిఓ కార్యాలయంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమం స్థానిక ఆఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ రాణి సుష్మిత మాట్లాడుతూ, భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆలోచనలు మరియు ఆలోచనలను వ్యాప్తి చేయడానికి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ఇందులో భాగంగా రాజ్యాంగ స్ఫూర్తిని నింపే ప్రతిజ్ఞను చేయడానికి ఈరోజును ఎంచుకున్నామన్నారు. తొలిదా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి …

Read More »

కల్లాల్లో ఉన్న ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలి

-4,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు. -1100 కోట్ల రూపాయిలు ఈరోజు తో మైలురాయి దాటాము.. -రైతుకు గోనసంచెలు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు లేకుండా చూడాలి -రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -రైతు సేవా కేంద్రాలను పరిశీలించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా కంకిపాడు మండలం లో పునాదిపాడు, కోలవెన్ను రైతు సేవా కేంద్రాలను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి …

Read More »