Breaking News

Monthly Archives: November 2024

పార్ట్ టైమ్ న్యూస్ కరస్పాండెట్లు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ప్రాంతీయ వార్తా విభాగానికి అమరావతి రాజధాని ప్రాంతం, శ్రీసత్యసాయి జిల్లాలో పార్ట్ టైమ్ న్యూస్ కరస్పాండెట్లు (Part Time Correspondent)గా పనిచేసేందుకు ఆస‌క్తి గల‌ స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి సాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. పార్ట్ టైమ్ కరస్పాండెంట్ అనేది కేవ‌లం పార్ట్ టైమ్ అసైన్‌మెంట్ మాత్ర‌మే అని, శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాద‌ని,పీఎఫ్, ఆరోగ్య ప‌థ‌కం, క్వార్ట‌ర్స్, పెన్షన్ …

Read More »

క్యాజువల్ న్యూస్ ఎడిటర్, క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ట్రాన్స్ లేట‌ర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ ఎడిటర్ (Casual News Editor), క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ట్రాన్స్ లేట‌ర్ (Casual Newsreader cum Translator)గా పనిచేసేందుకు ఆస‌క్తి గల‌ అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి సాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాజువల్ నియామ‌కాలు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావ‌ని, పీఎఫ్, ఆరోగ్య ప‌థ‌కం, క్వార్ట‌ర్స్, పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవని స్ప‌ష్టం చేశారు. క్యాజువల్న్యూస్ ఎడిటర్ …

Read More »

క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ట్రాన్స్ లేట‌ర్, క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ట్రాన్స్ లేట‌ర్ (Casual Newsreader cum Translator), క్యాజువల్ బ్రాడ్ కాస్ట్ అసిస్టెంట్ (Casual Broadcast Assistant)గా పనిచేసేందుకు ఆస‌క్తి గల‌ అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగాధిపతి సాయి వెంపాటి ఒక ప్రకటనలో తెలిపారు. క్యాజువల్ నియామ‌కాలు శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావ‌ని,పీఎఫ్, ఆరోగ్య ప‌థ‌కం, క్వార్ట‌ర్స్, పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవని స్ప‌ష్టం చేశారు. క్యాజువల్ న్యూస్ …

Read More »

పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ: మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి.. తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు అజరామరమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి మల్లాది విష్ణు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ.. భాషా …

Read More »

మూలపేట పోర్టు ప్రాంతంలో రూ.10 వేల కోట్లతో పారిశ్రామికాభివృద్ధి

-ఇంటికో పారిశ్రామికవేత్త రావాలి -టెక్కలి లేదా పలాసలో విమానాశ్రయం -ఈదుపురం గ్రామంలో దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో వెల్లడించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీకాకుళం/ఈదుపురం, నేటి పత్రిక ప్రజావార్త : మూలపేట పోర్టు ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతంలో పది వేల కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించిన …

Read More »

రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ ఆస్తులకు రక్షణ

-దేవాదాయ ఆస్తులను కాపాడేందుకు వక్ఫ్ ఆస్తుల రక్షణ తరహాలో కార్యాచరణ చేపట్టే యోచన -సుమారు 60 వేల ఎకరాల మేర ఎండోమెంట్స్ ఆస్తులు అన్యాక్రాంతం, ఆక్రమణ -ఐ.ఎస్.జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్తులకు రక్షణ -దేవాదాయ శాఖ కమిషనర్, ఏలూరు జిల్లా అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  దిశా నిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలకు, ధర్మ సత్రాలకు ఉన్న ఆస్తులను రక్షించే బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  అధికారులకు స్పష్టం చేశారు. …

Read More »

ఈదుపురంలో దీపం వెలుగులు

-ఏడాదికి మూడు సిలిండర్లు పంపిణీ ప్రారంభించిన ముఖ్యమంత్రి -ఇచ్చాపురంలో ఘన స్వాగతం పలికిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు -దీపం పథకం లబ్ధిదారు శాంతమ్మ ఇంట్లో టీ తయారుచేసిన సీఎం శ్రీకాకుళం/ ఇచ్చాపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం 2.O పథకానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం మూడు 12.45 నిమిషాలకు హెలికాప్టర్లో ఆయన ఈదుపురం చేరుకున్నారు. అక్కడ …

Read More »

మహిళల సేవలో దీపం-2 పథకం

-దీపావళి కానుకగా పండుగ వాతావరణంలో దీపం-2 కార్యక్రమాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా, యువజన & క్రీడల శాఖా మంత్రి -దీపం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుంది -లక్షలాది మంది మహిళల కళ్ళల్లో సంతోషం చూడడానికి దీపం-2 పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు -తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు పంపిణీ, తద్వారా ప్రతీ లబ్ధిదారునికి సం.రానికి రూ. 2,600 లబ్ధి జరుగుతుంది -చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు …

Read More »

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందజేయుచున్నాము

-ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరుచుటలో భాగంగా… -ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్లు ఉచితంగా లబ్ధిదారులకు అందిస్తున్నాం -ధర్మవరం నియోజకవర్గానికి 96 500 దీపం పథకం-2 లబ్ది -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మంత్రి సత్య కుమార్ యాదవ్ -కట్టెల పొయ్యే ఉన్న ఇంటికి గ్యాస్ సిలిండర్ తెచ్చింది చంద్రబాబే -రాప్తాడు ఎమ్మెల్యే సునీతమ్మ -లబ్ధిదారులు సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నంబర్ “1967”ని ఫోన్ ఫోన్ చేస్తే పరిష్కరిస్తాం -జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ధర్మవరం, నేటి పత్రిక …

Read More »

సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్లతో కూడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్లతో కూడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. రేపు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో “గుంతల రహిత రోడ్ల” మిషన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతల రహిత రోడ్లుగా మిషన్ …

Read More »