అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె.శ్యామలరావు, అదనపు …
Read More »Daily Archives: March 15, 2025
కన్నులపండువగా అమరావతిలో శ్రీనివాస కల్యాణం
-వేలాదిగా హాజరైన భక్తులు -ఆకట్టుకున్న అన్నమాచార్య సంకీర్తనల గానం -.గోవింద నామస్మరణతో మార్మోగిన కల్యాణ వేదిక ప్రాంగణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెంకటపాలెం శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీవారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. భారీ ఏర్పాట్ల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని చూసి తరించారు. శ్రీవారి కల్యాణోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణోత్సవ …
Read More »స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
-అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలనతో ముందుకెళ్తున్నాం -గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, పరదాలు కట్టుకుని తిరిగారు -సుస్థిరమైన ప్రభుత్వంతోనే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది -కేంద్రం అందిస్తున్న ఆర్థిక సాయంతో రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తాం -తణుకులో స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు -ఎన్టీఆర్ పార్కులో మున్సిపల్ కార్మికులతో కలిసి చెత్తను ఊడ్చి పరిశుభ్రం చేసిన ముఖ్యమంత్రి తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి. ఇళ్లతో పాటు మన …
Read More »స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం.
-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం… -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపించవచ్చునని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యాశాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ధర్మవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద శనివారం ఉదయం ఏర్పాటుచేసిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత …
Read More »అభివృద్ధి, సంక్షేమం.. మా ప్రభుత్వానికి రెండు కళ్లు
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -రూ.75 లక్షలతో పెద్దగువ్వలపల్లి-కల్లుకుంట బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి భూమి పూజ -రొద్దంలో రూ.5.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం -త్వరలో రూ.2.50 కోట్లతో మరో రెండు బీటీ రోడ్ల నిర్మాణాలు -గోకుల షెడ్ల నిర్మాణ పనులు కూడా… -ఎన్నికల హామీలను నెరవేర్చుతున్న సీఎం చంద్రబాబు : మంత్రి సవిత పెనుకొండ /రొద్దం, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని …
Read More »‘స్వచ్ఛాంధ్ర’లో స్వచ్ఛందంగా పాల్గొందాం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపు పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని పరిసరాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు. పెనుకొండ మున్సిపాలిటీ పరిధి దర్గా సర్కిల్లో శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛ దివస్ సందర్భంగా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత రోడ్లను శుభ్రం చేశారు. అంతకుముందు కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు, పట్టణ ప్రజలతో మానవహారంగా ఏర్పడి మంత్రి వారితో ప్రతిజ్ఞ …
Read More »శ్రీ దుర్గమ్మకు సంగీతార్చన
-ఆకట్టుకున్న వనిత సురేష్ భక్తి గీతాలాపనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సకల కళా ప్రియ అయిన కనకదుర్గమ్మవారికి శనివారం ఉదయం ఇంద్రకీలాద్రిపై సంగీతార్చన జరిగింది. ప్రముఖ సంగీత విద్వాంసురాలు వనిత సురేష్ గాత్ర కచేరి తో ఇంద్రకీలాద్రిపై భక్తులు పరవశించారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన కళావేదిక కేంద్రంగా శ్రీమతి వనిత సురేష్ తమ బృందం తో గాత్ర కచేరి చేశారు. మూడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పలు అమ్మవారి కీర్తనలు ఆలపించగా, పెద్ద …
Read More »వేద విద్య ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీ శృంగేరి శారదాపీఠం ఆధ్వర్యంలోని పల్నాడు జిల్లా మాదిపాడు గ్రామంలో ఉన్న వేద వేదాంత గురుకుల మహా విద్యాలయంలో వేద విద్య నభ్యసించదలచిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ధర్మాధికారి, ప్రొఫెసర్ డీవీఆర్ శేషాద్రి శనివారం తాడేపల్లిలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. 1993లో శ్రీ శృంగేరి శారదాపీఠం ఆశీస్సులతో స్థాపించబడిన ఈ గురు కుల మహా విద్యాలయం వేదజ్ఞానం, సనాతన ధర్మ పరిరక్షణ, అభ్యాసన లక్ష్యంగా పని చేస్తోందన్నారు. కృష్ణ యజుర్వేదం …
Read More »చిట్టినగర్ సొరంగం మార్గంలో కొండ రాళ్లు విరిగిపడ్డాయి అన్న వార్తలు వాస్తవం కాదు
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్ సొరంగం మార్గంలో కొండలు విరిగిపడ్డాయి అన్న వార్తలు వాస్తవం కాదని ఖండించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సొరంగంలో విజయవాడ నగరపాలక సంస్థ వారు చేపట్టిన పలు మరమ్మతుల కారణంగానే ట్రాఫిక్ మళ్లింపులు చేశారని తెలిపారు. నగర ప్రజలు ఇటువంటి వార్తలతో ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు, సంక్షేమం, నగరాభివృద్ది దిశగా చర్యలు తీసుకుంటుందని శనివారం …
Read More »రాజకీయ పార్టీల సలహాలు సూచనలను ముఖ్య ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయ పార్టీల సలహాలు సూచనలను ముఖ్య ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డా. జి. లక్ష్మి శ అన్నారు. భారత ఎన్నికల సంఘం ఈనెల నాలుగు, ఐదవ తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల నిర్వహణను బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో ప్రతినెల సమావేశం నిర్వహించి సలహాలు సూచనలను స్వీకరించాలని ఆదేశించారన్నారు. దీనిలో భాగంగా శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా …
Read More »