Breaking News

చిట్టినగర్ సొరంగం మార్గంలో కొండ రాళ్లు విరిగిపడ్డాయి అన్న వార్తలు వాస్తవం కాదు

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిట్టినగర్ సొరంగం మార్గంలో కొండలు విరిగిపడ్డాయి అన్న వార్తలు వాస్తవం కాదని ఖండించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సొరంగంలో విజయవాడ నగరపాలక సంస్థ వారు చేపట్టిన పలు మరమ్మతుల కారణంగానే ట్రాఫిక్ మళ్లింపులు చేశారని తెలిపారు. నగర ప్రజలు ఇటువంటి వార్తలతో ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు, సంక్షేమం, నగరాభివృద్ది దిశగా చర్యలు తీసుకుంటుందని శనివారం నాడు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *