Breaking News

శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్ర‌బాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి  ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ ఛైర్మన్  బీఆర్ నాయుడు, ఈవో  జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ నెల 30న పేద‌లకు ప‌ట్టాభిషేకం..

– సీఎం చేతుల మీదుగా పండ‌గ వాతావ‌ర‌ణంలో ప‌ట్టాల పంపిణీ – తొలిద‌శ‌లో 24,042 మంది ల‌బ్ధిదారుల‌కు ప‌ట్టాలు – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *