Breaking News

అభివృద్ధి, సంక్షేమం.. మా ప్రభుత్వానికి రెండు కళ్లు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-రూ.75 లక్షలతో పెద్దగువ్వలపల్లి-కల్లుకుంట బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి భూమి పూజ
-రొద్దంలో రూ.5.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం
-త్వరలో రూ.2.50 కోట్లతో మరో రెండు బీటీ రోడ్ల నిర్మాణాలు
-గోకుల షెడ్ల నిర్మాణ పనులు కూడా…
-ఎన్నికల హామీలను నెరవేర్చుతున్న సీఎం చంద్రబాబు : మంత్రి సవిత

పెనుకొండ /రొద్దం, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని , రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. కేవలం ఎనిమిది నెలల్లో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. రొద్దం మండలం పెద్దగువ్వలపల్లి గ్రామం నుంచి కల్లుకుంట క్రాస్ వరకు రూ.75 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శనివారం మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేస్తున్నామన్నారు. రొద్దం మండల వ్యాప్తంగా ఇప్పటికే 73 పనులు 5 కోట్లా 75 లక్షల రూపాయలతో పనులు పూర్తి చేశామన్నారు. ఎన్నో ఏళ్ల ప్రజల పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, రూ.2.80 కోట్లతో నల్లురు నుంచి కల్లుకుంట బ్రిడ్జి పనుల త్వరలో పూర్తికానున్నాయని మంత్రి సవిత వెల్లడించారు.

రూ.2.50 కోట్లతో మరో రెండు బీటీ రోడ్ల నిర్మాణం
మండలంలో రూ.2.50 కోట్లతో మరో రెండు బీటీ రోడ్లు నిర్మించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. రూ.కోటీ 20 లక్షలతో నల్లూరు నుంచి దందేపల్లి క్రాస్ వరకు బీటీ రోడ్డు నిర్మించనున్నామన్నారు. రూ.కోటీ 30 లక్షలతో దొడగట్ట నుంచి డీఆర్ కొట్లాల వరకూ మరో బీటీ రోడ్డు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామన్నారు. మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశామన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సీఎం చంద్రబాబునాయుడు రెండు కళ్లలా చేపట్టారన్నారు.

మరిన్ని గోకుల షెడ్ల నిర్మాణం
రొద్దం మండల వ్యాప్తంగా 44 గోకుల షెడ్లు నిర్మించామని మంత్రి సవిత వెల్లడించారు. త్వరలో మరిన్ని గోకులాలు నిర్మించనున్నామన్నారు. దొడగట్టలో విద్యుత్ సబ్ స్టేషన్ ను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రూ.20 కోట్లతో చేపట్టిన ఎంజేపీ స్కూల్ భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. పేదోడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు పున:ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *